కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయండి

news02 July 18, 2018, 11:01 a.m. political

uttam

హైద‌రాబాద్‌: రాహుల్ గాంధీ క‌ల‌ల ప్రాజెక్టు శ‌క్తి యాప్‌లో ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వాములు కావాల‌ని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఈవిష‌యంలో ఎల్‌.డి.ఎం.ఆర్‌.సి బూత్ అధ్య‌క్షులు క్రీయ‌శీల‌కంగా ప‌నిచేసి త‌మ త‌మ బూత్ స్థాయిల్లో క‌నీసం 50 మంది పేర్ల‌ను శ‌క్తి యాప్‌లో న‌మోదు చేయించేలా కృషి చేయాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ హుమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ద్వారా (చార్మ్స్‌) పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్...ఏక కాలంలో 4,500 మంది ఎల్.డి.ఎం.ఆర్‌.సి బూత్ స్థాయి అధ్య‌క్షులతో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా కెప్టెన్ ఎల్.డి.ఎం.ఆర్‌.సి బూత్ అధ్య‌క్షులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. 

uttam 2

కాంగ్రెస్ బ‌లోపేతానికి శ‌క్తి యాప్ ఎంతోగానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని...అందుకే ఎల్.డి.ఎం.ఆర్‌.సి అధ్య‌క్షులు ఓట‌ర్ పేజీ మ్యాపింగ్ విష‌యంలో అత్యంత క్రీయాశీల‌కంగా ప‌నిచేయాల‌ని సూచించారు. బూత్ స్థాయిలోని ప్ర‌జ‌ల‌తో సంబంధాలు మెరుగుప‌రుచుకొని...వారి పేర్ల‌ను శ‌క్తి యాప్‌లో న‌మోదు చేయించేలా చూడాల‌న్నారు. నియోజ‌క‌వర్గాల‌లో బూత్ క‌మిటీ ఏర్పాటు, ఓట‌ర్ పేజీ మ్యాపింగ్ ప‌ద్ధ‌తిని అధ్య‌క్షులు క్రియాశీల‌కంగా చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌తి బూత్‌లో ఓట‌ర్ పేజీ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించి...ఆయా పేజీల‌కు బాధ్యుల‌ను అప్ప‌గించాల‌న్నారు. త‌ద్వారా  ఆయా ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు, మ‌న భావ జాలం వైపు ఆక‌ర్షితుల‌య్యేలా చూడాల‌ని సూచించారు.

uttam 3

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను చూస్తుంటే ఎన్నిక‌లు ముంద‌స్తుగానే వ‌చ్చే  అవ‌కాశాలున్నాయ‌ని... అధికార పార్టీలు ఆ విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం ఉంద‌ని...అందువ‌ల్ల బూత్ క‌మిటీల నియామ‌కం, శ‌క్తి ప్రాజెక్టు, ఓట‌ర్ పేజీ మ్యాపింగ్, సాంకేతికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండేలా కార్య‌క‌ర్త‌లను స‌న్న‌ద్ధం చేయాల‌ని ఉత్త‌మ్ సూచించారు. ఇక శ‌క్తి అప్‌లో పేరు న‌మోదు చేసుకోవ‌డం వ‌ల్ల కార్య‌క‌ర్త‌ల‌కు, అధిష్టానంతో నేరుగా త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ సాంకేతిక సౌకర్యాన్ని వినియోగించుకోవ‌డం ద్వారా కార్య‌క‌ర్త‌లు త‌మ ఆలోచ‌న‌ల‌ను పంచుకునే అవ‌కాశం దొరుకుంద‌ని అన్నారు. 

uttam

ఇక రాష్ట్రంలోని 31 రిజ‌ర్వుడు సెగ్మెంట్ల‌పై కాంగ్రెస్ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన నేప‌థ్యంలో... అక్క‌డి బూత్ స్థాయి అధ్య‌క్షుల‌తో కూడా టెలికాన్ఫ‌రెన్స్‌లో ఉత్త‌మ్ నేరుగా మాట్లాడారు. ఈసంద‌ర్భంగా వారికి కెప్టెన్ ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతానికి రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గాలు ఎంతో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. అందుకే ఈసెగ్మెంట్ల‌లోని బూత్ స్థాయి అధ్య‌క్షులు మ‌రింత క్రీయాశీల‌కంగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎఐసిసి ఎస్‌.సి సెల్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, ఎల్‌.డి.ఎం.ఆర్‌.సి కో ఆర్డినేట‌ర్ హ‌ర్క‌ర వేణుగోపాల్‌, చార్మ్స్ ఇంచార్జ్ మ‌ద‌న్ మోహ‌న్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

tags: uttam,shakti app,ldmrc,congress cadre,telecoference,uttam kumar reddy,uttam kumar reddy wife,uttam kumar reddy son,uttam kumar reddy songs,uttam kumar reddy bus yatra,uttam kumar reddy photos,uttam kumar reddy age,uttam kumar reddy speech,uttam kumar reddy mp3 songs,uttam kumar reddy wife photos uttam kumar reddy family,uttam kumar reddy audio songs,uttam kumar reddy anumula,uttam kumar reddy address,uttam kumar reddy affidavit,uttam kumar reddy assets,uttam kumar reddy air force,uttam kumar reddy army,uttam kumar reddy minister address,uttam kumar reddy house address,uttam kumar reddy biography,uttam kumar reddy biodata,uttam kumar reddy birthday,uttam kumar reddy brothers,uttam kumar reddy business,uttam kumar reddy beard,uttam kumar reddy congress,uttam kumar reddy childrens,uttam kumar reddy congress party,,uttam kumar reddy constituency,uttam kumar reddy contact number,uttam kumar reddy caste,uttam kumar reddy contact details,uttam kumar reddy cat,uttam kumar reddy minister contac

Related Post