దళితున్ని సీఎంను చేస్తానన్న హామీ ఏమైంది

news02 April 15, 2019, 8:24 a.m. political

uttam

తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం, న్యాయం, చట్టం ఏదీ పనిచేయదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఓ నియంత రాజ్యం నడుస్తోందని ఆన మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటు గాంధీ భవన్ లో అంబేద్కర్ ఫోటోకు పూల మాలవేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.  అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి చెత్త డంపింగ్ యార్డ్ లో పడేసినా సమాజంలో స్పందన రాకపోతే ఎలా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

uttam

గతంలో అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. చైనా, జపాన్ లాంటి దేశాలను తిరిగి నమూనాలు చూసివచ్చినా.. ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణలో ఇంత నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఈ పాలకులకు అంబేద్కర్ జయంతిని జరిపే అర్హత లేదని విమర్శించారు. ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా టీఆర్ ఎస్ నాయకులకు లేదని ఉత్తమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చి వారిని మోసం చేశారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ ధళితున్ని సీఎల్పీ లీడర్ గా చేస్తే.. కేసీఆర్ భరించలేక ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

tags: uttam, pcc chief uttam, uttam fire on cm kcr, uttam in ambedkar jayanthi, uttam comments on cm kcr, uttam fire on cm kcr

Related Post