క్షీణించిన ఆరోగ్యం..

news02 June 13, 2018, 10:53 a.m. political

vajpayee

న్యూ డిల్లీ- మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. చాలా కాలంగా ఇంటికే పరిమితం అయిన వాజ్ పెయి కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను డిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వాజ్ పేయి శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక వాజ్‌ పేయి చికిత్సకు స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నామని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు నిన్న బులిటెన్ విడుదల చేశారు. 

atal

అటల్ బిహాపీ వాజపేయి ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. నిన్న సాయంత్రం ఆస్పత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో బీజేపీ వర్గాలు కలవరపడుతున్నాయి. వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని సమాచారం. ఇక మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తదితరులు ఎయిమ్స్‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడాలని బీజేపీ శ్రేణులు పూజలు.. ప్రార్దనలు నిర్వహిస్తున్నారు.

atal bihari

tags: vajpayee, atal bihari vajpayee, vajpayee health, vajpayee in aims, vajpayee health condition

Related Post