క‌ర్నాట‌క‌లో విచిత్ర ప‌రిస్థితి

news02 May 15, 2018, 5:47 p.m. political

voting percentage
బెంగ‌ళూరు: క‌న్న‌డనాట ఎన్నిక‌ల ఫ‌లితాలు విచిత్ర ప‌రిస్థితిని త‌ల‌పిస్తున్నాయి. 2013 క‌న్నా కాంగ్రెస్ త‌న ఓటింగ్ ప‌ర్సెంటేజిని పెంచుకున్నా.. ఫ‌లితం లేకుండా పోయింది. ఓటింగ్ శాతానికి త‌గిన విధంగా కాంగ్రెస్ సీట్లు సాధించ‌లేక‌పోయింది. 2013 శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 36.6 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఈసారి 1.3 ఓట్ల శాతాన్ని పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. 37.9 శాతం ఓట్ల‌ను సాధించింది. అయితే గ‌తంలో త‌క్కువ ఓట్ల శాతం వ‌చ్చిన‌ప్ప‌టికి అధికారాన్ని నిల‌బెట్టుకుంది. ఈసారి మాత్రం ఓటింగ్ శాతాన్ని పెంచుకున్న సీట్లు సంఖ్య ప‌డిపోవ‌డం విశేషం. 

voting percentage 2

ఈసారి కాంగ్రెస్ పార్టీలా ఓటింగ్ ప‌ర్సెంటేజి లేకున్నా.. బిజెపికి క‌లిసోచ్చిద‌నే చెప్పాలి. ఆపార్టీ కాంగ్రెస్ క‌న్నా త‌క్కువ శాతం ఓట్ల‌ను సంపాదించిన‌ప్ప‌టికీ ఎక్కువ సీట్ల‌ను గెలుచుకోవ‌డం విశేషం. బిజెపికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగ‌ర్ రాకున్నా.. పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఫ‌లితంగా 104 స్థానాలు సంపాదించి కొద్దిలోనే అధికారానికి దూర‌మైంది.

voting percentage 3

అయితే కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలిచిన స్థానాల్లో వారికి ఎక్కువ శాతం ఓట్లు రావ‌డం... బిజెపి అభ్య‌ర్థులు గెలిచిన స్థానాల్లో వారికి త‌క్కువ శాతం ఓట్లు రావ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఓడిపోయిన చాలా స్థానాల్లో భారీ ఓట్లు సాధించ‌డం ఇలాంటి ప‌రిస్థితికి కారణ‌మ‌ని చెబుతున్నారు.  అందుకే బీజేపీ అనేక స్థానాల్లో బోటాబోటి మెజార్టీతో గెలిచి ఓటింగ్ శాతం త‌గ్గినా... ఓవ‌రాల్‌గా అధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకోగ‌ల్గిందంటున్నారు.

tags: ka,karnataka,voting,congress,bjp,elections,modi,rahul

Related Post