కేసీఆర్ మరీ దారుణంగా..

news02 Oct. 7, 2018, 3:50 p.m. political

బాబు

కేసీఆర్ ను నమ్మితే ఇక అంతే సంగతులు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారట. టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు కేసీఆర్ గురించి ఆసక్తిరమైన అంశాలను వెల్లడించారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోను రెండు పార్టీలు కలిసి ఉంటే దక్షిణాదిలో బలం ఉంటుందని.. ఢిల్లీలోను తెలుగు రాష్ట్రాల అభివృద్దికి దోహదపడుతుందని తాను కేసీఆర్ తో చెప్పినట్టు బాబు గుర్తు చేశారు. ఐతే తన ప్రతిపాదనకు ముందు సరేనని చెప్పిన కేసీఆర్.. ఆ తరువాత వారం రోజులకే ప్లేటు ఫిరాయించి.. టీడీపీతో కలిసి ఉండటానికి నో చెప్పారట. అంతే కాదు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవద్దని.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని చంద్రబాబు కు సూచించారట కేసీఆర్. దీంతో కేసీఆర్ ను బీజేపీ పార్టీ బాగా ప్రభావితం చేస్తోందని తనకు అర్దమైందని చంద్రబాబు ఎంపీలతో వ్యాఖ్యానించారు.

బాబు

కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై మనకు షరతులు పెడితే ఎలా అని ప్రశ్నించిన చంద్రబాబు.. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మలేమని ఎంపీలతో అన్నారట. 2014 ఎన్నికల సమయంలో ఏపీలోజగన్‌తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వస్తుందని ముందే కేసీఆర్‌ చెప్పాడుని గుర్తు చేసిన చంద్రబాబు... ఏపీలో జగన్‌ వస్తే అతని ముందు తానే సమర్థుడిగా చలామణి కావొచ్చని ఆశించాడు... కానీ ఏపీ ప్రజలు కేసీఆర్‌ ఆశల్ని తారుమారు చేశారు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభద్రతా భఆవంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడినట్లు సమాచారం.

tags: చంద్రబాబు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పై చంద్రబాబు ఆగ్రహం, chandrababu, chandrababu naidu, chandrababu fire on kcr, chandrababu about kcr, babu fire on kcr, babu fire on cm kcr

Related Post