జ‌నం మునుగుతున్నా మీకు ప‌ట్ట‌దా.?

news02 Aug. 18, 2019, 10:45 a.m. political

pavan_kalyan_cemment_on_drone_politics

విజ‌య‌వాడ లోని కృష్టా బ్యారేజ్ కు నీళ్లు చేరండంతో.. ఏపీలో ఒక్క‌సారిగా అదికార , ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య సెగ‌లు రేపాయి. కృష్టాన‌ది క‌ర‌క‌ట్ట పై ఉన్న‌ చంద్ర బాబు నివాసం టార్గెట్ గా వైసీపీ పాలిటిక్స్ కు ప‌దును పెట్టింది. చంద్ర‌బాబు నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రికరించ‌డం., వాటిని మంత్రులు స‌మ‌ర్థించడంతో.. టిడిపి- వైసీపి ల మ‌ధ్య మాట‌ల యుద్దం  పీక్ చేర్చింది.  మాజీ సీఎం నివాసం పై డ్రోన్ కెమెరా చిత్రిక‌ర‌ణ‌కు ఎలా అనుమ‌తిస్తార‌ని.. చంద్ర‌బాబు ను చంపేందుకు కుట్ర‌చేస్తున్నారా.? అంటు టిడిపి నేత‌లు డిజిపికి పిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. టిడిపి నేత‌ల డైలాగ్ లు.. మంత్రులు కౌంట‌ర్స్ తో ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి. ఇలా ఇప్పుడు ఏపీలో సెగ‌లు రేపుతున్నడ్రోన్ పాలిటిక్స్ పై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వెంటనే డ్రోన్ రాజకీయాలు ఆపాలని అన్నారు. వైసీపీ, టీడీపీ నేతల తీరుని పవన్ తప్పుపట్టారు. కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సాయం చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కరకట్ట చుట్టూ తిరగడం టైం వేస్ట్ చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు ప‌వ‌న్. 

drone_politics_in_ap

వరద ఉధృతి ఉన్న సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మాని.. కరకట్ట మీదున్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేయ‌డ‌మేనా.. మంత్రులు బాధ్యతా? అని పవన్ నిలదీశారు. వరద ఉధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని .. ఇప్ప‌డికైనా క‌ళ్ళు తెర‌వండ‌ని హెచ్చరించారు పవన్. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి వారికి కావాల్సిన సాయం చేయాలని ప్రభుత్వానికి పవన్ సూచించారు. మాజీ సీఎం ఇంటిని ముంచేస్తారా? అని టిడిపి.. మునిగిందా? లేదా? అని చూసేందుకు వైసీపీ నాయ‌కులు రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోవాలని సూచించారు.వైసీపీకి ప్ర‌జ‌లు 151 సీట్లు ఇచ్చింది ఇందుకేనా..?  కాస్త‌ బాధ్యతతో పరిపాలన అందించాలని హితవు పలికారు జ‌న‌సేనాని. 

tags: pavan kalyan, janasena chief, hot comment,ap ,drone camera, ex cm chandrababu residency, ycp, tdp, ap ministers, ap cm jagan, krishna barrege, fluds, krishna karakatta

Related Post