మోదీ ఫిట్‌నెట్ వ్యాఖ్య‌ల‌పై కుమార‌స్వామి కామెంట్స్‌

news02 June 13, 2018, 4:54 p.m. political

kumarswamy counter to naredra modi

బెంగ‌ళూరు: ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ లో భాగంగా ప్ర‌ధాని మోదీ క‌ర్నాట‌క సీఎం కుమార‌స్వామికి విసిరిన ఫిట్‌నెస్ స‌వాల్‌పై ఆయ‌న విభిన్నంగా స్పందించారు. ప్ర‌ధాని మోదీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను గౌర‌వంగా స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. త‌న ఆరోగ్యంపై మోదీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ అనేది అంద‌రికీ ముఖ్య‌మైన‌దేన‌ని...అందుకే ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌తి రోజు వ్యాయామం చేస్తాన‌ని పేర్కొన్నారు. రోజూ ఉద‌యం లేవ‌గానే ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్స్‌, యోగా చేస్తాన‌ని తెలిపారు. 

kumarswamy counter by the twitter

అయితే ప్ర‌ధాని చెప్పిన విధంగా ఫిట్‌నెస్ క‌న్నా... రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, అభివృద్ధిపైనే ఎక్కువ‌గా ఆందోళ‌న‌గా ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోదీ కూడా క‌ర్నాట‌క ఆర్థిక ప‌రిస్థితిని మెరుగు ప‌రిచేందుకు స‌హ‌క‌రిస్తే బాగుంటుంద‌న్నారు. ఈమేర‌కు ప్రధాని మోదీని కర్ణాటక సీఎంఓ ట్విటర్‌ ద్వారా సీఎం కుమారస్వామి కోరారు. అయితే ఇది కాస్తా ఇప్పుడు ట్రెండింగ్ కావ‌డంతో...నెటిజ‌న్లు కుమార‌స్వామిని అభినందిస్తున్నారు. మోదీ ఫిట్‌నెస్ వ్యాఖ్య‌లకు స‌రైన కామెంట్స్ పెట్టార‌ని సెటైర్లు వేస్తున్నారు. 

tags: kumarswamy counter on modi fitness comments,modi fitness comments,kumarswamy cmo twitter,modi fitness,narendra modi fitness,narendra modi fitness regime,narendra modi fitness routine,narendra modi fitness tips in hindi,modi fitness challenge,apple fitness modi hospital,modi fitness india,modi fitness mantra,modi fitness secret,nawaz modi singhania fitness,modi fitness video,radhika kumaraswamy fitness,fitness den kumaraswamy layout,xtreme fitnes,kumaraswamy layout,platinum fitness kumaraswamy layout,fitness gym in kumaraswamy layout,snap fitness kumaraswamy layout,professional fitness kumaraswamy layout

Related Post