ప్ర‌జ‌ల‌కు భరోసా ఇచ్చేందుకే యువ‌నేత ప‌ర్య‌ట‌న‌

news02 Aug. 10, 2018, 4:27 p.m. political

uttam

హైద‌రాబాద్‌: ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ హైద‌రాబాద్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకే యువ‌నేత హైద‌రాబాద్‌లో ఈనెల 13,14 తేదీల్లో ప‌ర్య‌టిస్తార‌ని తెలిపారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన పీసీసీ ఛీప్ ఉత్త‌మ్‌... టీఆర్ఎస్ స‌ర్కార్  రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు ఆటంకాలు క‌ల్పించాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు. ఎవ‌రెన్ని ఇబ్బందులు చేసిన రాహ‌ల్ గాంధీ టూర్‌ను చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌న్నారు. 13న మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ  చేరుకుంటార‌ని... అనంత‌రం తొలుత క్లాసిక్ కన్వెన్ష‌న్‌లో మహిళా సంఘాలతో ఆయ‌న భేటీ అవుతార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క గ్రూప్‌ల సాద‌క‌బాద‌కాల‌ను రాహుల్ అడిగి తెలుసుకొని వారికి భ‌రోసా ఇస్తార‌ని పేర్కోన్నారు. అనంత‌రం శేరిలింగంపల్లిలో జరిగే సభలో యువ‌నేత సీమాంధ్రుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తార‌ని... వారికి అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉండేలా భ‌రోసా క‌ల్పిస్తార‌ని చెప్పారు. రాత్రికి హ‌రిత ప్లాజాలో బ‌స ఉంటుంద‌ని పేర్కోన్నారు.

rahul

ఇక 14వ తేదీ ఉద‌యం రాహుల్ రాష్ట్రంలోని 31 వేల మంది పార్టీ బూత్ స్థాయి క‌మిటీ అధ్య‌క్షుల‌తో టెలికాన్ప‌రెన్స్ ఉంటుంద‌ని...ఈ టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా బూత్ స్థాయి నేత‌లు యువ‌నేత‌తో త‌మ అభిప్రాయాల‌ను నేరుగా పంచుకోవ‌చ్చ‌న్నారు. బూత్ స్థాయి మీటింగ్ అయిపోగానే మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించే ఎడిటర్ల‌ సమావేశంలో రాహుల్ పాల్గొన‌నున్న‌ట్లు ఉత్త‌మ్ తెలిపారు. తరువాత హోటల్ తాజ్‌లో యువ పారిశ్రామిక వేత్తలతో రాహుల్ భేటీ అవుతార‌న్నారు. అనంత‌రం గన్ పార్క్ వ‌ద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాహుల్ నివాలర్పించ‌నున్న‌ట్లు పేర్కోన్నారు. ఆ తర్వాత ఎగ్జ్‌బిష‌న్ గ్రౌండ్లో జరిగే గోషామ‌హ‌ల్ నియోనికవర్గ కార్యకర్తల సమావేశానికి యువ‌నేత హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇక సాయంత్రం  4 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జ‌రిగే విద్యార్థి నిరుద్యోగ గ‌ర్జ‌నలో రాహుల్ పాల్గొని ప్ర‌సంగిస్తార‌న్నారు. ఈ స‌భ‌లో మోడీ, కేసీఆర్ నిరుద్యోగుల‌కు చేసిన మోసాన్ని ఎండ‌గ‌ట్టేలా రాహుల్ ప్ర‌సంగం కొన‌సాగ‌నున్న‌ట్లు ఉత్త‌మ్ తెలిపారు.

uttam

ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాహుల్ ఓయూ టూర్,ముస్లిం సంఘాల‌తో భేటీ అంటేనే భ‌యం ప‌ట్టుకుంద‌ని...రాహుల్ ఓయూ ప‌ర్య‌ట‌న‌, నాంప‌ల్లిలో ముస్లిం సంఘాల‌తో భేటీని టీఆర్ఎస్ అడ్డుకోవాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు. అయితే అలాంటీ వాటికి కాంగ్రెస్ శ్రేణులు భ‌య‌ప‌డ‌బోర‌ని... రాష్ట్ర ప్ర‌భుత్వ నిరంకుశ విధానాల‌ను ఎదుర్కోనేందుకు వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. రాహుల్ త‌న టూర్‌లో సెటిల‌ర్స్‌కు కావాల్సిన భ‌రోసాను ఇస్తార‌ని... వారికి పార్టీ ప‌ద‌వుల్లో త‌గిన స్థానం క‌ల్పించేలా రాహుల్ హామీలుంటాయ‌ని చెప్పారు.

shabbir

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ... ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని చూస్తేనే కేసీఆర్-ఎంఐఎం పార్టీల‌కు వ‌ణుకు మొద‌లైంద‌ని అందుకే రాహుల్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన‌ప్ప‌టి నుంచి వారు భ‌యంతో చ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు. మోదీపై విమ‌ర్శ‌లు సంధిస్తున్న ఎంఐఎం... కేసీఆర్ మోదీకి స‌పోర్టు చేస్తున్నా... ఆ పార్టీ ఎందుకు నోరు మెద‌ప‌డం లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాహుల్‌కు భ‌య‌ప‌డే హాకీ గ్రౌండ్‌కు కేసీఆర్ అనుమ‌తి క్యాన్స‌ల్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌న్నారు.

tags: rahul tour,rahul telangana tour,uttam kumar reddy,uttam,rahul paryatana,rahul telangana paryatana,uttam pc,andhra setilers,trs,bjp,modi,uttam kumar reddy,uttam kumar reddy wife, uttam kumar reddy son,uttam kumar reddy twitter,uttam kumar reddy contact number,uttam kumar reddy songs,uttam kumar reddy images uttam kumar reddy age,uttam kumar reddy congress,uttam kumar reddy mp3 songs,uttam kumar reddy jagan,uttam kumar reddy pcc uttam kumar reddy address,uttam kumar reddy army,uttam kumar reddy assets,uttam kumar reddy audio songs,uttam kumar reddy air force uttam kumar reddy affidavit,uttam kumar reddy house address,uttam kumar reddy minister address,uttam kumar reddy birthday uttam kumar reddy beard,uttam kumar reddy biodata,uttam kumar reddy brothers,uttam kumar reddy business,uttam kumar reddy constituency uttam kumar reddy caste,uttam kumar reddy congress party,uttam kumar reddy cat,uttam kumar reddy minister contact number,captain uttam kumar reddy tpcc chief uttam kumar reddy,capt

Related Post