సీఐడి స్టేట్ మెంట్ లో జగ్గారెడ్డి పేరే లేదు

news02 Sept. 12, 2018, 10:26 p.m. political

uttam

ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంగారెడ్డిలో జరిగిన మైనార్టీ గర్జనలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ ఓ బట్టెబాజ్ అని అన్నారు. జగ్గారెడ్డి అరెస్ట్ అయినట్టే త్వరలోనే కేసీఆర్ సైతం అరెస్ట్ అవుతారని ఉత్తమ్ చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డిపైనా ఉత్తమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహేందర్ రెడ్డి కేసీఆర్ తొత్తుగా మారి తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతి తెలివి చూపించొద్దని.. కేవలం కేసీఆర్ కు చెంచాగిరి మాత్రం చేసుకోవాలని మడీజీపీ మహేందర్ రెడ్డిని హెచ్చరించారు ఉత్తమ్. 

uttam

ఇక జగ్గారెడ్డి ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే జగ్గారెడ్డిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. గతంలో సంగారెడ్డిలో జగ్గారెడ్డి రాహూల్ గాంధీ సభ నిర్వహించారన్న అక్కసుతో కేసీఆర్ ఆయనను అరెస్ట్ చేయించారని ఉత్తమ్ మండిపడ్డారు. 2004లో నమోదైన పాస్ పోర్ట్ కేసుకు సంబందించిన సీఐడి స్టేట్ మెంట్ లో జగ్గారెడ్డి పేరు ఎక్కడా లేదని.. కానీ కేసీఆర్, హరీష్ రావుల పేర్లు మాత్రం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గుజరాతి మహిళను తన భార్యగా పేర్కొంటూ హరీష్ రావు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. 

uttam

నకిలీ పాస్ పోర్ట్ కేసులో కేసీఆర్, హరీష్ రావు, ఎంపీ మధుసూదనా రెడ్డి, కేసీఆర్ పీఏ అజిత్ రెడ్డిల పేర్లు ఉన్నాయని అన్నారు. అనవసరంగా కుట్ర పూరితంగా కేసులు పెడుతున్న వారి జాబితాను తయారు చేస్తున్నామని ఉత్తమ్ హెచ్చరించారు. మోదీకి చెంచాగిరి చేస్తున్న కేసీఆర్.. 30 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 3కోట్లకే ఎంఐఎం కు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇక మెదక్ జిల్లాలో 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెప్పారు.

 

tags: uttam, uttam fire on kcr, uttam fire on dgp, uttam fire on dgp mahender reddy, uttam fire on trs, uttam fire oj harish rao, uttam in minority gharjana, uttam in sangareddy minority gharjana

Related Post