కర్నాట‌క MLAలుగా గెలిచిన ఎక్కువ మంది కోటిశ్వ‌ర్లే

news02 May 17, 2018, 10:58 a.m. political

ka mlas

బెంగ‌ళూరు: దేశ వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో విభిన్న కోణాలు వెలుగుచూస్తున్నాయి. త్రిముఖ పోరు జ‌రిగిన క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలు డ‌బ్బున్న అభ్య‌ర్థుల‌కే ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితంగా ఈసారి ఎన్నికైన 222 మంది ఎమ్మెల్యేల‌లో 215 మంది కుబేరులేన‌ని తేలింది. క‌ర్నాట‌క ఎల‌క్ష‌న్ వాచ్‌, అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) నిర్వ‌హించిన‌ నివేదిక‌లో ఇదే విష‌యం స్ప‌ష‌మైంది. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు అభ్య‌ర్థులు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ఆధారంగా ఆసంస్థ ఈస‌ర్వేను నిర్వ‌హించింది. 

ka 2

క‌ర్నాట‌క ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రు స‌గ‌టున 35 కోట్ల రూపాయాల సంపాద‌న క‌ల్గి ఉన్నార‌ని ఏడీఆర్ త‌న నివేదిక‌లో పేర్కొంది. 2013 ఎన్నిక‌ల్లో గెలిచిన వారి క‌న్నా.. ఇది 11 కోట్లు ఎక్కువ‌ని తేలింది. అత్యధిక మంది సంప‌న్న ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్ పార్టీ మొద‌టి స్థానంలో నిలిచింది. 10 మంది సంప‌న్న‌ ఎమ్మెల్యేల‌లో 7గురు కాంగ్రెస్ శాస‌న స‌భ్యులున్నారు. ఇక బీజేపీ త‌ర‌పున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 98 శాతం, జేడీఎస్ త‌ర‌పున ఎన్నికైన వారిలో 95 మంది కోటీశ్వ‌ర్లు ఉన్న‌ట్లు ఏడీఆర్ పేర్కొంది.

ka 3

అంతేకాకుండా 35 శాతం క్రిమిన‌ల్ కేసులున్న వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన‌ట్లు పేర్కొంది. క్రిమిన‌ల్ కేసులు ఎక్కువ‌గా ఉన్న‌వారిలో బీజేపీ నేత‌లే అధిక‌మ‌ని తేల‌డం విశేషం. 41 శాతం మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమిన‌ల్ కేసులున్న‌ట్లు ఏడీఆర్ త‌న నివేదిక ద్వారా వెల్ల‌డించింది. మొత్తంగా డ‌బ్బు, క్రిమిన‌ల్ కేసులు ఎక్కువ‌గా ఉన్న వారే ఈసారి శాస‌న స‌భ్యులుగా ఎన్నిక కావ‌డం విశేషం. 

tags: rich mlas,bjp,congress,karnataka,jds,criminals,

Related Post