40 నిమిషాల పాటు ఏకాంతం చ‌ర్చ‌

news02 June 12, 2018, 10:52 a.m. political

trump-kim

సింగ‌పూర్: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్కంఠ‌గా ఎదురు చూసిన బ‌ద్ద విరోధులు  అమెరికా, ఉత్త‌ర కొరియా అదినేతలు ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ మ‌ధ్య జ‌రిగిన‌ భేటీ ముగిసింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు(భార‌త కాల‌మానం ప్ర‌కారం 6:30) సింగ‌పూర్‌ సెంటోసా దీవిలోని కెపెల్లా హోట‌ల్‌లో స‌మావేశ‌మైన ఇరువురు అధినేతలు దాదాపు 40 నిమిషాల పాటు ద్వైపాక్షి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అణునిరాయుధీక‌ర‌ణ‌, దౌత్య సంబంధాలు, ఆర్థిక అంశాల‌పై ట్రంప్‌, కిమ్‌లు ప్ర‌ధానంగా చ‌ర్చించారు. 

trump-kim

ముఖ్యంగా ఇరు దేశాధినేతల‌ మ‌ధ్య అణ్వాయుధ నిర్మూల‌న‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగింది. ఉత్త‌ర కొరియా క‌నుక అణ్వాయుధాల‌ను సంపూర్ణంగా నిర్మూలిస్తే... మీ భ‌ద్ర‌త‌కు అండ‌గా ఉంటామ‌ని ట్రంప్ తెలిపిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉత్తర‌కొరియాకు భ‌ద్ర‌త ప‌రంగా ఎలాంటీ ఇబ్బందులు రాకుండా ప్రత్యేక భద్రతా విధానాన్ని కూడా రూపొందించ‌నున్న‌ట్లు ట్రంప్...ఉత్త‌ర కొరియాకు ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌పంచ దేశాలు స‌రిచూసుకుని...సంతృప్తి చెందే విధంగా ఉత్త‌ర కొరియా అణ్వాయుధాల‌ను నిర్మూలించాల‌ని ట్రంప్ సూచించిన‌ట్లు తెలుస్తోంది.  ఇందుకు కిమ్ వెన‌క‌డుగు వేయ‌రాద‌ని... అందుకు మాత్ర‌మే స‌మ్మ‌తిస్తామ‌నీ... ట్రంప్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే అప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌ర‌కొరియాపై అమెరికా విధించిన ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని...ట్రంప్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. 

trump-kim 3
మ‌రోవైపు అణు నిరాయుధీక‌ర‌ణ అనేది ఎజెండాలోని ప్ర‌ధాన అంశమ‌ని ఉత్త‌ర‌కొరియా కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఉత్త‌ర కొరియా స‌ముద్ర తీరంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ను రూపుమాపేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకునేందుకు కిమ్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆదేశం స్ప‌ష్టం చేసింది. అలాగే దీర్ఘ‌కాల శాంతి స్థాప‌న‌, ప‌రిర‌క్ష‌ణకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకునేందుకు కిమ్ కృషి చేస్తార‌ని ఆదేశ మీడియాలో ఇప్ప‌టికే వార్త‌లు కూడా రావ‌డం విశేషం. 

tags: kim,trump beti,kim,trump meeting, singapoor,trump kim meeting,trump kim meeting date,trump kim meeting location,trump kim meeting singapore,trump kim meeting news,trump kim meeting place,trump kim meeting cancelled,trump kim meeting mongolia,trump kim meeting may,trump kim meeting coin,trump kim meeting wiki,trump kim meeting when,trump kim meeting announcement,trump and kim meeting,trump and kim jong meeting,donald trump meeting kim jong un,trump kim meeting bbc,trump kim meeting cnn,trump kim meeting conditions,cnn trump kim meeting,trump kim meeting fox news,trump kim meeting finland,trump kim meeting hotel,trump kim meeting june,trump meeting kim jong un,trump meeting kim jong,trump kim meeting latest,trump kim meeting location singapore,trump kim meeting new york times,trump kim meeting on,trump on meeting kim jong un,trump kim meeting reuters,trump kim meeting reddit,trump kim meeting security,trump kim meeting switzerland,trump kim meeting site,trump kim meeting sentosa,trump ki

Related Post