టిఆర్ఎస్ లో భూకంపం

news02 June 7, 2018, 9:20 p.m. political

trs danger mlas

హైదరాబాద్ : అధికార టిఆర్ఎస్ లో 39 మందికి మూడిందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఇదంతా సీఎం కేసీఆర్ చూపిస్తున్న సర్వేల్లోనే తేలిందట. మొదటినుంచి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సర్వేలు చేశారు. అయితే తాజాగా చేసిన సర్వేలో 39 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలిందట.

ఈ వార్త తెలిసినప్పటినుంచి ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఎవరనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో సహా టిఆర్ఎస్ కు మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 39 మంది ఎమ్మెల్యేల సర్వే ఫలితాలు బాగా వీక్ ఉన్నట్లు చెబుతున్నారు. దక్షిణ కన్నా ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

trslp meeting

జిల్లాల వారీగా డేంజర్ జోన్ ఉన్న ఎమ్మెల్యేల జాబితా..

 

మహబూబ్ నగర్ (ఉమ్మడి జిల్లా)

 

అచ్చంపేట.. గువ్వల బాలరాజ్ 

మక్తల్ .. చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మహబూబ్ నగర్ : శ్రీనివాస్ గౌడ్

నారాయణ్ పేట : రాజేందర్ రెడ్డి

 

ఆదిలాబాద్ ( ఉమ్మడి జిల్లా)

 

బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య

 

చెన్నూరు : నల్లాల ఓదెలు

 

మంచిర్యాల : దివాకర్ రావు

ఖానాపూర్ : రేఖా నాయక్

 

కరీంనగర్ 

 

పెద్దపల్లి : మనోహర్ రెడ్డి

రామగుండం : సోమవరపు సత్యనారాయణ

మంథని : పుట్టా మధు

చొప్పదండి : బొడిగే శోభ

మానకొండూరు : రసమయి బాలకిషన్

 

ఖమ్మం :

ఇల్లందు : కోరం కనకయ్య

కొత్తగూడెం : జలగం వెంకట్రావు

అశ్వారావుపేట: తాటి వెంకటేశ్వర్లు

 

మెదక్ 

నారాయణ్ ఖేడ్  : భూపాల్ రెడ్డి

అందోల్ : బాబు మోహన్

సంగారెడ్డి : చింతా ప్రభాకర్

నర్సాపూర్ : చిలుముల మదన్ రెడ్డి

నల్గొండ

మిర్యాలగూడ : భాస్కర్ రావు

తుంగతుర్తి : గాదరి కిషోర్

దేవకొండ : రవీంద్ర కుమార్

మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఆలేరు : గొంగిడి సునీత

 

నిజామాబాద్ 

బోధన్ : షకీల్

కామారెడ్డి : గంప గోవర్ధన్

నిజామాబాద్ (అర్భన్) గణేష్ బిగాల

 

రంగా రెడ్డి జిల్లా

మల్కాజ్ గిరి : కనకా రెడ్డి

శేరిలింగంపల్లి: అరికే పూడి గాంధీ

చేవెళ్ల : యాదయ్య

వికారాబాద్ : సంజీవ్ రావు

మేడ్చల్ : సుధీర్ రెడ్డి

 

వరంగల్

జనగాం : ముత్తిరెడ్డి యాదిరెడ్డి

భూపాలపల్లి : మధుసూదనా చారి

ములుగు : చందు లాల్

మహబూబాబాద్ : శంకర్ నాయక్

 

మంత్రులు

 

(1) పద్మా రావు

(2) తలసాని శ్రీనివాస్ యాదవ్

(3) జగదీష్ రెడ్డి

ఇదంతా సర్వేల్లో తక్కువ స్కోర్ సంపాదించిన వాళ్ళుగా ప్రచారం అవుతోంది. అయితే ఇప్పటికే సిట్టింగ్ లందరికీ మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎలాగూ అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడే టికెట్ ఇవ్వలేమని చెబితే ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుంటారు. అందరికీ టికెట్ ఇవ్వలేరు కాబట్టి కొందరిని ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేసేందుకు కేసీఆర్ ఇలాంటి డ్రామాకు తెరలేపారని చర్చ జరుగుతోంది. కావాలని కేసీఆర్ ఈ వార్తను లీక్ ఇచ్చి వుంటారని అనుకుంటున్నారు కొందరు. కేసీఆర్ ఎత్తులు తెలిసిన వాళ్ళు అయితే వీళ్లకు టికెట్ కట్ చేసేందుకే ఇలాంటి ఆటలు మొదలుపెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వార్త టీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తోంది.

 

 

 

tags: trslp meeting, kcr with mnlas, trs mlas in danger zone, kcr survey, trs party, cm kcr whatsapp number, trs mlas in telangana assembly, telangana mla phone numbers, hi gopi telugu, trs mlas contact numbers, trs survey, telangana formation, cm kcr birthday, cm kcr photos, cm kcr speech, telangana cm kcr speech, federal front, pranab mukharji, rss meeting, nagpuir rss meeting, praveen thogadiya.

Related Post