గజ్వేల్ నుంచి గద్దర్ పోటీ..

news02 Oct. 8, 2018, 5:33 p.m. political

gaddar

ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా గాయకుడు గద్దర్ షాక్ ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రానిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టీఆర్ ఎస్ నేతల్లో కంగారు మొదలైంది. ప్రజా యుద్ద నౌకగా పేరు పొందిన గద్దర్ తన పాటలతో జనాన్ని చాలా కాలంగా ఆకట్టుకుంటున్నారు. సమాజంలోని అంతరాలను, ప్రజా సమస్యలను, సామాజిక అంశాలెన్నింటినో గద్దర్ తన పాటల ద్వార ప్రజల్లోకి తీసుకెళ్లారు. గద్దర్ పాటంటే జనం కేవలం వినడమే కాదు.. పాటలోని అర్ధాన్ని, ఆర్ధతను అర్ధం చేసుకుంటారు. అందుకే గద్దర్ ప్రజా గాయకుడయ్యారు.

gaddar

ఇక ఇప్పుడు అలాంటి గద్దర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే.. అదీ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారంటే.. టీఆర్ ఎస్ వర్గాల్లో కలవరం మొదవ్వడం సహజమే అనుకొండి. ఐతే తాను గజ్వేల్ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపధ్యంలో తనకు రక్షణ కల్పించాలని గద్దర్ కోరుతున్నారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు గద్దర్. తాను ఎన్నికల్లో ఓటు హక్కు గురించి.. దాని విలువ గురించి ప్రజలకు తన పాటల ద్వార చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్న నేపధ్యంలో.. తనకు రక్షణ కల్పించడంతో పాటు.. తనకు ఓ గైడ్ లా ఉండాలని రజత్ కుమార్ ను కోరారు గద్దర్.

gaddar

tags: gaddar, gaddar meet ec, gaddar contesting in gajwel, gaddar contesting from gajwel, gaddar contesting gajwel assembly

Related Post