సంచలనం రేపిన సినిమా..

news02 Aug. 8, 2018, 12:26 p.m. political

karunanidhi bio movie

న్యూస్ పిల్లర్ (స్పెషల్ డెస్క్)- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇక లేరు. ఆయన నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో తమిళనాడంతా కన్నీటి పర్వంతమైంది. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి.. రచయితగా ప్రస్థానం ప్రారంభించి.. ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చిన కరుణానిధి జీవితంలో ఎన్నో ఆటు పోట్లున్నాయి. మరింత గొప్ప నాయకుడి జీవిత చరిత్రపై సినిమా వచ్చిందని మీకు తెలుసా...

prakash raj

అవును కరుణానిధి.. ఎంజీ రామచంద్రన్ జీవితంపై తమిళ, తెలుగు, హిందీ, మళయాలం బాషల్లో సినిమా వచ్చింది. ప్రముఖ దర్శకులు మణిరత్నం తీసిన ఈ సినిమా పేరు ఇరువరు. అదే తెలుగులో ఇద్దరు పేరుతో వచ్చింది. 1997లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇరువర్ సినిమాలో కరుణానిధి.. ఎంజీ రామచంద్రన్ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు మణిరత్నం. ఇక సినిమాలో కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటించగా.. ఎంజీ రమచంద్రన్ గా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ నటించిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే.

ishwarya rai

ఇక ఇద్దరు సినిమాలో కరుణానిధిగా నటించిన ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందించారు. మరో ఇంట్రస్టింగ్ ఘటన ఏంటంటే.. ఇరువర్ సినిమాపై సెన్సార్ బోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి స్వయంగా సినిమా చూసి.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని ఆయనే సూచించడం విశేషం.

iddaru

 

 

tags: iruvar, iddaru, karunanidhi iruvar, karunanidhi iddaru, maniratnam iruvar, maniratnam iddaru, karunanidhi bio movie, karunanidhi bio film, karunanidhi bio movie iruvar, karunanidhi bio movie iddaru, prakash raj as a karunanidhi

Related Post