ఆర్ఎస్ఎస్ మదిలో ఏముంది..

news02 June 10, 2018, 7:21 a.m. political

pranab

న్యూ డిల్లీ (పొలిటికల్ డెస్క్)- రానున్న 2019 ఎన్నికల నాటికి దేశరాజకీయాల్లో సంచలనాలు జరగవచ్చని రాజకీ. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగాని.. కాంగ్రెస్ పార్టీకి గాని పూర్తిస్తాయి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందుకే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో కృతీయ ఫ్రంట్ దిశగా ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు మెదులుపెట్టాయి. 

modi rahul

ఇక దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో తృతీయఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేసి గెలిస్తే ప్రధాని అభ్యర్ధిగా ఎవరుండాలి.. అందరికి ఆమోదయోగ్యమైన ప్రధాని అభ్యర్ది ఎవరు.. అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఈ చర్చలో భాగంగా తెరపైకి వచ్చిన పేరు ప్రణబ్ ముఖర్జి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి అయితే అన్ని రాజకీయ పక్షాలకు ఎటువంటి అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

rahul babu

ఇలాంటి ముందు చూపుతోనే ఆర్ఎస్ఎస్ ప్రణ్బ్ ముఖర్జీని తమ కార్యక్రమానికి అహ్వానించిందని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ గనుక రాకపోతే.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితే వస్తే.. అప్పుడు ప్రధాని అభ్యర్దిగా ప్రణబ్ ఐతే ఎవ్వరికి అభ్యంతరం ఉండదన్న ముందుచూపుతోనే ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

rahul kcr

ఇక నెహ్రూ సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్న ప్రణబ్‌కు ఆరెస్సెస్‌ ఆహ్వానం అంత సులువుగా తీసుకునే పరిణామంకాదని చెప్పవచ్చు. ఈ వ్యవహారంపై శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ శనివారం సంపాదకీయం రాసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే.. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావడంలో ఏలాంటి సందేహం లేదని సామ్నా పేర్కొంది..
 
మరోవైపు ఆరెఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రణబ్‌ ముఖర్జీ తాను స్వతంత్రుడినని, కాంగ్రెస్ పార్టీ తో తాను పూర్తిగా  సంబంధాలను తెంచేసుకున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ తో ఉన్నప్పుడు కూడా ప్రణబ్‌ తన సొంత వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారనే చెప్పవచ్చు. 2004లో తనను కాదని, తనకంటే జూనియర్‌ అయిన మన్మోహన్‌ సింగ్‌ను సోనియాగాంధీ ప్రధానిగా ఎంపిక చేసినప్పటికీ ప్రణబ్ ఎక్కడా తన అసంతృప్తి, అసమ్మతిని బయటపెట్టలేదు.

tags: pranab, 2019 election, pm candidate, bjp pm candidate, pranab pm candidate

Related Post