గద్వాల్ లో కాంగ్రెస్ సమరశంఖం..

news02 Oct. 4, 2018, 10:08 p.m. political

uttam

జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అంతకు ముందు జోగులాంబ అమ్మావారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు.. రోడ్ షో లు నిర్వహిస్తూ గద్వాల్ చేరుకున్నారు. గద్వాల్ లో నిర్వహించిన భహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. భహిరంగ సభలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానా రెడ్డి, షబ్బీర్ ఆలి, విజయశాంతి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్నారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభంజనం చూసి కేసీఆర్ కు వణుకు మొదలైందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు రాజకీయంగా ఘోరీ కడతారని హెచ్చరించారు ఉత్తమ్. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంపై పడి గజదొంగల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

uttam

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టడం చారిత్రక అవసరం అని ఉత్తమ్ అన్నారు. తాను దేశం కోసం పనిచేశానని గుర్తు చేసిన ఉత్తమ్.. కేసీఆర్ మాత్రం పాస్ పోర్ట్ బ్రోకర్ గా పనిచేశారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి వర్గంలో చేర్చుకున్నందుకు ఏ మొహంపై ఉమ్మెయ్యాలని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముదనష్టపు పాలనతో రైతులంతా తీవ్రంగా నష్టపోయారని ఆవేధన వ్యక్తం చేశారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడంతో పాటు... పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెల నెలా నిరుద్యోగ భృతి కల్పించడంతో పాటు.. విధ్యార్ధులందరికి ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి యేడాదే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 

uttam

ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభఉత్వ ఉద్యోగులుగా గుర్తించి.. ఉద్యోగులందరికి పాత సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి మహిళా సంధానికి వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు అందిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. గొర్ల కాపర్లకు పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పిన పీసిసి అధ్యక్షులు.. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆఱు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. కేసీఆర్ డూల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని దోఖా బాజ్ చేశారని ఫైర్ అయిన ఉత్తమ్.. తాము ఇందిరమ్మ ఇళ్ల బకాయీలు చెల్లించడంతో పాటు.. మరో గది కట్టుకోవడానికి డబ్బలు, కొత్తగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకునేవారికి ఐదు లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇఖ కేసీఆర్ చేతిలో మోసపోయిన జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఉత్తమ్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రేషన్ షాపుల ద్వార సన్న బియ్యం పంపిణీచేయడంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇస్తామని చెప్పారు. 

uttam

ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే కేసీఆర్ కు ఎందుకని ప్రశ్నించిన ఉత్తమ్.. పొత్తుల పేరుతో డబ్బులు తీసుకోవడం కేసీఆర్ కు అలవాటని మండిపడ్డారు. కేసీఆర్ మోదీకి చెంచా అని విమర్శించిన ఉత్తమ్.. పిచ్చి మాటలు మానుకోవాలని కేసీఆర్ కు సూచించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే మీ తోలు వలుస్తామని టీఆర్ ఎస్ ను హెచ్చరించారు డీకే అరుణ. టీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది కల్ల అన్న ఆమె.. టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు జాగ్రత్త అన్న ఆమె.. దమ్ముంటే గద్వాలకు రండి నేనేం చేశానో చూపిస్తానని సవాల్ విసిరారు. రాహూల్ గాంధీ తెలంగాణ పర్యటన తరువాత కాంగ్రెస్ ఆధరణ చూసి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్న డీకే ఆరుణ.. కేసీఆర్ ఓ పెద్ద జూటాకోర్ అని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం కబ్జా చేసేందుకు కొంగరకలాన్ భూమిని మీటింగ్ పేరుతో చదును చేశారని అరుణ ఆరోపించారు. గద్వాల్ లో టీఆర్ ఎస్ నేతలకు మా అడ్రస్ చెప్పుకుంటేనే దిక్కని ఎద్దేవా చేశారు. గద్వాల్ నుంచే కాంగ్రెస్ విజయ శంఖారావం మొదలైందన్న డీకే అరుణ.. కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు.
 

tags: congress meeting, gadwal congress meeting, congress meeting in gadwal, uttam meeting in gadwal, uttam fire on kcr in gadwal, uttam fire on trs in gadwal meeting, dk aruna fire on kcr in gadwal, vijayashanti fire on kcr in gadwal

Related Post