బిజెపిపై కుమార‌స్వామి ఆగ్ర‌హం

news02 May 16, 2018, 1:05 p.m. political

kumaraswamy

బెంగ‌ళూరు: బీజేపీపై జేడీఎస్ అగ్ర‌నేత కుమార్‌స్వామి మండిప‌డ్డారు. బీజేపీ దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. క‌ర్నాట‌కలో నెల‌కొన్న ప‌రిస్థితిపై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు.  య‌డ్యూర‌ప్ప వ‌ర్గం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తామ‌ని ఆశ చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

kumaraswamy 2

ప్ర‌ధాని మోదీపైనా కుమార్ స్వామి విరుచుకుప‌డ్డారు. ప్రజలందరి ఖాతాల్లో 15 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పిన ప్ర‌ధాని.. ఇప్పుడు ఆ డ‌బ్బును ఎమ్మెల్యేల కొనుగోలుకు ఉప‌యోగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. జేడీఎస్ కు కాంగ్రెస్ మ‌ద్ద‌తివ్వ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని తెలిపారు. క‌ర్నాట‌క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ జేడీఎస్‌కు మ‌ద్ద‌తు తెలిపింద‌న్నారు. బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విధానాన్ని తిప్పికొడుతామ‌న్నారు.  

tags: kumaraswamy,jds,bjp,congress,mlas,elections

Related Post