కొత్త డీసీసీల‌కు రాహుల్ గ్రీన్ సిగ్న‌ల్ ..

news02 Jan. 3, 2019, 11:32 p.m. political

rahul_gandhi_on_new_dcc_presidents

హైద‌రాబాద్ - తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌క్షాళ‌న దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  ఓట‌మి త‌ర్వాత డీలాప‌డిన కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ నిర్మాణం, బ‌లోపేతం పై దృష్టి సారించింది. పంచాయితీ,  ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ఒక‌వైపు స‌మాయాత్తం అవుతూనే.. డీసీసీ అధ్య‌క్షుల నియామకానికి శ్రీకారం చుట్ట‌బోతుంది కాంగ్రెస్  దీనిలో భాగంగా.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షులను నియ‌మించ‌బోతుంది.

తెలంగాణ ఆవిర్బావం త‌ర్వాత సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల‌కు శ్రీకారం చుట్టారు. పాత ప‌ది జిల్లాల‌కు తోడు 21 జిల్లాల‌ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. తాజాగా నారాయ‌ణ‌పేట్, ములుగు క‌లుపుకుంటే.. ప్ర‌స్తుతం 33 జిల్లాలు అవుతాయి. అయితే కొత్త జిల్లాల‌ను ఏర్ప‌డినా.. కాంగ్రెస్ పార్టీ ఆ కొత్త‌ జిల్లాల‌కు డిసిసిల‌ను నియ‌మించ‌లేదు. పాత ప‌ది జిల్లా అద్యక్షుల‌తోనే స‌రిపెట్టింది. ఒక ద‌శ‌లో కొత్త జిల్లాల‌కు అద్య‌క్షుల‌ను నియ‌మించాల‌ని టి పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భావించినా.. దానికి పార్టీ హైక‌మాండ్ అనుమ‌తివ్వ‌లేదు. దీంతో పాత ప‌ది జిల్లాల  అధ్యక్షుల‌తోనే.. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ.

uttham_kumar_reddy_on_new_dcc

రాష్ట్రంలో పార్టీ ఓట‌మి త‌ర్వాత డిల్లీలో ఏఐసీసీ అధ్య‌క్షులు రాహుల్ గాంది.. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ భేటీలో.. రాహుల్ డీసీసీల నియామ‌కం పై ఉత్త‌మ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల అధ్యక్షుల‌ను నియ‌మించాల‌ని ఆధేశించారు రాహుల్. అది కూడా జ‌న‌వ‌రి 10 తేది లోపు డిసీసీ అధ్య‌క్షుల నియామ‌కాల‌ను పూర్తి  చేయాల‌ని  సూచించిన రాహుల్ గాంధీ నియామ‌కాల‌ను పూర్తి చేసుకుని.. పంచాయితీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని రాష్ట్ర నాయ‌క‌త్వానికి  ఆధేశించారు.

అయితే ప్ర‌స్తుతం ఉన్న పాత ప‌ది జిల్లాలలో  రంగారెడ్డి, ఖ‌మ్మం జిల్లా డిసిసిల‌కు అధ్య‌క్షులు లేరు. ఖ‌మ్మం జిల్లా అధ్య‌క్షులు ఐత స‌త్యం మృతి చెంద‌గా., ఇక రంగారెడ్డి ప్రెసిడెంట్  క్యామామ‌ల్లేష్  పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌టంతో.. పార్టీనుండి తొల‌గించారు. దీంతో ఖాలీ అయ్యింది. మొత్తానికి పార్టీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్న‌ల్ రాడంతో.. ఇక మొత్తం 33 జిల్లాల‌కు అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించేందుకు టిపీసీసీ ఛీప్ ఉత్త‌మ్ క‌స‌ర‌త్తు ప్రారంబించ‌బోతున్నారు.

tags: rahul gandhi, uttham kumar reddy, tpcc cheif, dcc presidents, selection , district , telangana, rahul green signal ,

Related Post