ఏం మాట్లాడుకుంటారో..

news02 June 9, 2018, 9:30 a.m. political

babu

న్యూడిల్లీ-అమరావతి (నేషనల్ డెస్క్)- ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల విషయంలో అన్యాయం జరిగిందని బీజేపీ సర్కారుతో టీడీపీ తెలగతెంపులు చేసుకుంది. అదిగో అప్పటి నుంచి బీజేపీ-టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణు.. విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక బీజేపీ-టీడీపీ తెగతెంపులు తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు.. చాలాకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఓ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ సాధారణ మండలి సమావేశంలో బాబు-మోదీ కలనున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి.. బీజేపీతో తెగతెంపుల తరువాత ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.  

modi

ఇక 16న జరిగే సమావేశంలో ప్రధానిని చంద్రబాబు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని విభజన హామీలన్నింటిని నెరవేర్చాలని.. లేదంటే తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుందని నీతీ అయోగ్ సమావేశం వేధికగా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల అభివృద్దికి సంబందించి మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ ఏపీ విశయంలో ఏంచెబుతారన్నదీ ఆసక్తికరంగా మారింది.

 

tags: babu, modi, pm modi, chandra babu, babu meet modi, babu mee pm modi

Related Post