మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికి షాకిచ్చిన ఎన్నారైలు ..!

news02 July 8, 2018, 2:39 p.m. political

NATA

న్యూయార్కు : అమెరికాలోని పెన్సిల్వేనియాలో జ‌రుగుతున్న ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (నాటా) కు కూడా తెలంగాణ పొలిటిక‌ల్ సెగ త‌గిలింది. నాటా స‌భ‌ల్లో జ‌రిగిన తెలంగాణ పొలిటిక‌ల్ డిబేట్ ర‌సాభ‌సాగా మారింది . ఈ చ‌ర్చా గోష్టి మొత్తం  కాంగ్రెస్ వ‌ర్సెస్ టిఆర్ఎస్ గా న‌డిచింది . ఈ చ‌ర్చ‌లో పాల్గొన్న  మంత్రి జ‌గ‌ద్శ‌ర్ రెడ్డి కి ఎన్నారైలు షాకిచ్చారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు .. పాల‌నాతీరుపై జ‌రుగుతున్న చ‌ర్చ‌లో కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి .. మ‌ధుయాష్కి .. బీజేపీ నేత కృష్ణ సాగ‌ర్ రావు లు మాట్లాడుతున్న క్ర‌మంలో మంత్రి జ‌గ‌దేశ్వ‌ర్ రెడ్డి అడ్డుత‌గులుతుండ‌టంతో వాగ్వీవాదం తీవ్ర‌త‌ర‌మైయ్యింది .

NATA

టీఆర్‌ఎస్‌ పాలనపై జ‌రిగిన‌ చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్‌ వ్యవహారంపై మండిపడ్డారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వృధా చేస్తోందన్నారు . ఇది ఎంత వరకు సమంజసమ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు . మిషన్‌ కాకతీయ భవిష్యత్ లో మిషన్‌ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం అన్నారు . తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దేన‌న్న ఆయ‌న ..  హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు .

NATA

ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించార‌న్న కాంగ్రెస్ నేత‌లు .. ఉద్య‌మ క్రెడిట్ ను కేసీఆర్‌ మొత్తం లాగేసుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని విమర్శించారు . దీనిపై మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు పస లేనివని .. గాంధీభవన్‌ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామన్నారు . బీజేపీ నేత కృష్ణ సాగర్‌ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదన్నారు . ఆయన వర్క్ ఫ్రమ్‌ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా అని ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వారి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు .

NATA

దాంతో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది . ఒకానోక టైంలో రేవంత్ రెడ్డి .. జగదీశ్ రెడ్డి లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్‌ వేడెక్కింది. వారిని శాంతిపజేసేందుకు అక్క‌డున్న పాత్రికేయులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో స‌మావేశంలో పాల్గొన్న ఎన్నారైలు మంత్రి ప్ర‌వ‌ర్థ‌న‌పై ఆందోళ‌న‌కు దిగారు . కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేడంతో మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఖంగుతిన్నారు . సీన్ రివ‌ర్స్ కావ‌డంతె జ‌గ‌దీశ్వ రెడ్డి అక్క‌డి నుంచి నిశ్క్ర‌మించారు .చివ‌రికి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితిని అదుపు చేయాల్సివ‌చ్చింది .

NATA

 

tags: NRI'S Shock to TRS in NATA,NATA,KCR,REVANTH REDDY,MADHU YASHKI,BJP,KRISHNA SAGAR RAO,JAGADESHWAR REDDY,TRS,CONGRESS,GANDHIBHAVAN,TRS BHAVAN,KTR,HARISH RAO,KAVITHA,UTTAM KUMAR REDDY,NATA SABHALU,AMERICA

Related Post