విజ‌యం సాధించిన సౌమ్యారెడ్డి

news02 June 13, 2018, 1:35 p.m. political

soumyareddy

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క రాజ‌కీయాలు మొన్న‌టి వ‌ర‌కూ ఉత్కంఠ రేపిన విష‌యం తెలిసిందే. స‌ర్కారు ఏర్పాటు విష‌యంలో అధికారం బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్ మ‌ధ్య దోబూచులాడిన విష‌యం విధిత‌మే. ఈఎన్నిక‌ల్లో బీజేపీకి అత్య‌ధిక స్థానాలు ద‌క్కిన‌ప్ప‌టికీ..స‌ర్కారును నిల‌బెట్టుకోలేక‌పోయింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌తో జ‌త క‌ట్ట‌డ‌డంతో...అనేకమైన‌ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల త‌ర్వాత ఆరెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అయితే ఈపొత్తును అప‌విత్ర‌మైన‌దిగా అభివ‌ర్ణించిన బీజేపీకి తాజాగా...మ‌రో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. బీజేపీ సిట్టింగ్ స్థానం జ‌య‌న‌గ‌ర్‌ను ఆపార్టీ కోల్పోయింది. ఈస్థానం నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రామ‌లింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి విజ‌య ఢంకా మోగించారు. 

jayanagar

సౌమ్య‌రెడ్డి జ‌య‌న‌గ‌ర సెగ్మెంట్‌లో 54457 ఓట్లు సాధించారు. ఇక్క‌డి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి ప్రహ్లాద్ బాబుకు 51568 ఓట్లు వ‌చ్చాయి. దీంతో సౌమ్య‌రెడ్డి 2889 ఓట్ల తేడాతో ప్ర‌హ్లాద్‌పై విజ‌య సాధించారు. ఇక్క‌డ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు జేడీఎస్ మ‌ద్ద‌తునిచ్చింది. అయితే బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటులో బొల్తా ప‌డి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి యెడ్డీ రాజీనామా చేసినందున‌...ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంద‌నుకుంటే ఆ ప్ర‌భావం పెద్ద‌గా ప‌నిచేయ‌న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ సీట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోవడం..ఆపార్టీకి మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది. 

jayanagar

మ‌రోవైపు బీజేపీకి సింపాతీ పెద్ద వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో...కాంగ్రెస్‌-జేడీఎస్ స‌ర్కారుకే ప్ర‌జ‌లు ఓటేసిన‌ట్లైంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ అనుస‌రించి విధానాలే ఆపార్టీ కొంప ముంచాయంటున్నారు. బూత్ స్థాయిలో విప‌రీతంగా డ‌బ్బులు పంచ‌డంతోనే బీజేపీకి ఆస్థాయి సీట్లు వ‌చ్చి ఉండ‌వ‌చ్చంటున్నారు. మొత్తంగా బీజేపీకి ఈఉప ఎన్నిక‌ల ద్వారా ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం నేర్పిన‌ట్లైంద‌ని విశ్లేష‌కులు చెబుతుండ‌డం విశేషం. 

tags: sowmya reddy victory on jayanagar by polls,ramalinga reddy daughter,karnataka jayanagar,karnataka jayanagar election,karnataka jayanagar mla,karnataka jayanagar election date,karnataka jayanagar constituency,karnataka jayanagar bypoll,karnataka jayanagar poll,karnataka jayanagar results,karnataka jayanagar candidates,karnataka jayanagar election date 2018,karnataka bank jayanagar 4th block,karnataka jayanagar election 2018 karnataka jayanagar assembly election,karnataka bank atm jayanagar,karnataka badminton association jayanagar,karnataka jayanagar by election,karnataka bank jayanagar 9th block,karnataka bank jayanagar,karnataka bank jayanagar 3rd block, karnataka bank jayanagar 4th block ifsc code,karnataka bank jayanagar 3rd block ifsc code,karnataka bank jayanagar 9th ,block phone number,jayanagar bengaluru karnataka,karnataka bank ifsc code jayanagar,karnataka bank jayanagar contact number,jayanagar karnataka pin code,karnataka emporium jayanagar,karnataka fisheries jayanagar,karn

Related Post