నేను ఎమ్మెల్యే ప్రియురాలిని..

news02 June 23, 2018, 8:39 a.m. political

premakumari

మైసూర్ (కర్నాటక)- ఆయన ఎట్టకేలకు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఐతే ఎమ్మెల్యే అయిన ఆనందం ఆయనకు లేకుండా పోయింది. నేు మీ మాజీ ప్రియురాలినంటూ ఓ మహిళ వెంటపడటంతో సదరు ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేదట. ఇంటా బయట పరవు పోతుండటంతో ఏంచేయాలో పాలుపోవడం లేదట ఈ ఎమ్మెల్యేకు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా.. ఐతే ఈ స్టోరీ చదవండీ..

prema ramdas

కర్నాటక లోని కృష్ణ రాజ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఎస్ఏ రామదాస్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అన్నీ కలిసి వచ్చి బీజేపీ గనుక అధికారంలో కొనసాగి ఉంటే ఈయన మంత్రి కూడా అయ్యేవారట. ఐతే అది వేరే సంగతనుకొండి. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఓ మహిళ ఈ ఎమ్మెల్యేకు వణుకు పుట్టిస్తోంది. ప్రేమ కుమారి అనే మహిళ రామదాస్ ఇంటికి వచ్చి సార్ ను కలవాలని రెండు మూడు రోజుల నుంచి గొడవ చేస్తోంది. ఎమ్మెల్యే గారు లేరని చెప్పినా వినిపించుకోవడం లేదు.

premakumari

తాను ఎమ్మెల్యే రామదాస్ గారి మాజీ ప్రియురాలినని బాహాటంగా చెప్పేస్తోంది ఆమె. అన్నీ కలిసి వస్తే ఎమ్మెల్యేకు పెళ్లానైపోతానని కూడా కుండబద్దలు కొడుతోందట. ఐతే ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో మళ్లీ రావాలని చెప్పినా వినిపించకోవడం లేదు ప్రేమ కుమారి. తన ప్రియుడు ఎమ్మెల్యే రామదాస్ వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతోంది. దీంతో ఏంచేయాలో సెక్యూరిటీకి అర్దం కావడం లేదట.

premakumari ramdas

ఐతే ప్రేమ కుమారి చెప్పేదాంట్లో కొంత వాస్తవం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికలకు ముందు తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమకుమారి రామదాస్ పై ఎత్తి తెచ్చిందట. ఐతే రామదాస్ పట్టించుకోకపోవడంతో ఆయనపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైందట ప్రేమకుమారి. అంతే కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ సైతం వేసిందట. ఇదంతా తన పదవికి ఎసరు వచ్చేలా ఉందని భయపడిన రామదాస్ ప్రేమకుమారికి అక్షరాల 5కోట్ల రూపాయలు ఇచ్చి బుజ్జగించాడట. మళ్లీ ఏమైందో కాని తనకు తన ఎమ్మెల్యే ప్రియుడు కావాలని ప్రేమకుమారి పట్టుబడుతోంది. మరి ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే రామదాస్ ఎలా ముగిస్తాడన్నదే కర్నాటక రాజకీయవర్గాల్లో ఆసక్తినెలకొంది.

tags: ramadas, premakumari, bjp mla ramadas, krishnaraju mla ramadas, ramadas lover, ramadas lover premakumari, premakumari agitation, premakumari demand

Related Post