కేసీఆర్ కు ఎమ్మెల్యేలను కొనడమే పని

news02 June 8, 2019, 9:10 p.m. political

uttam

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీనీ టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జి కుంతియా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌. సీనియర్‌ నేతలు వీహెచ్‌, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేరెళ్ల శారద, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిద్దరు కలిసి చేస్తున్న మోసం వల్ల కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలంగాణ ప్రజలు ఎక్కుగా నష్టపోతున్నారని ఉత్తమ్ అన్నారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తాడని తామనుకోలేదని చెప్పారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి పోతే.. వీళ్ల కంటే మొనగాళ్లను తీసుకొచ్చి నిలబెతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

uttam 

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేస్తే.. ఏ సమస్యపైనా ప్రశ్నించే వారు ఉండరని కేసీఆర్ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని ఉత్తమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, డబ్బులకు ప్రలోభ పెట్టి దుర్మార్గంగా కొన్నాడని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తగ్గిస్తే కాంగ్రెస్ కు నష్టమై... ప్రజలకు నష్టమా ఆలోచించాలని ఉత్తమ్ అన్నారు. తాము స్పీకర్ ను కలవాలని ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని.. కానీ అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు మాత్రం రహస్య ప్రదేశంలో 3గంటల పాటు సమయం ఇచ్చారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్ విధ్యార్దుల ఆత్మహత్యసు, రైతు సమస్యలపై ఏ మాత్రం స్పందించని సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలను కొనే పనిలో లీనమైపోయాడని మండిపడ్డారు. దళితుడైన మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ దీక్ష కాంగ్రెస్ పార్టీది కాదు.. ప్రజా స్వామ్యానిదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా స్వామ్యం పట్టపగలే ఖూనీ అవుోతందని.. కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్టని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని గుర్తు చేసిన భట్టి.. సదరు ఎమ్మెల్యేల పై పిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. 
 

tags: bhatti hunger srike, mallu bhatti vikramarka hunger strike, uttam fire on cm kcr, uttam support bhatti hunger strike, uttam participated bhatti hunger strike, pcc chief fire on cm kcr, uttam fire on clp merge in trslp, uttam about clp merge in trslp

Related Post