ఓటర్లను మభ్యపెట్టాలనుకున్న టీఆర్ఎస్ కు ఝలక్

news02 Oct. 4, 2018, 8:32 a.m. political

ec

ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎలాగైనా ఓటర్లను మభ్యపెట్టి.. వారికి డబ్బు, మధ్యం ఆశ చూపి ఓట్లు దండుకోవాలనుకుంటున్న టీఆర్ ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగింది. ఈ దసరా సందర్బంగా బతుకమ్మ చీరలను పంపిణీచేసి ఓటర్లను ప్రభావితం చేయాలనుకున్న కేసీఆర్ ఆపధ్దర్మ సర్కార్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఇలా ఎన్నికలకు ముందు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎలక్షన్ కమీషన్ భావించింది. ఎందుకంటే గత యేడాది బతుకమ్మ చీరల పంపిణీ ఎంత హాడావుడిగా.. ఎంత హంగామా చేశారో ఎన్నికల సంఘం పరిశీలించిందట. 

ec

ఒక్కో బతుకమ్మ చీర ఖరీదు వంద రూపాయలైతే.. దాని ప్రచారానికి.. పంపిణీ ఆర్భాటానికి రెండు వందల రూపాయలు ఖర్చు చేసిందంట కేసీఆర్ ప్రభుత్వం. అంటే చారణా కోడికి బారణా మాసాల అన్న చందంగా.. నాసి రకం చీరలిచ్చి.. వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం ఖర్చు చేశారన్నమాట. ఇక ఇప్పుడు కూడా బతుకమ్మ చీరల పేరిట భారీగా టీఆర్ ఎస్ ప్రచారం చేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ప్రాణాళికలను రూపొందించుకుందని పసిగట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దానికి బ్రేక్ వేసింది. ఈ సారి బతుకమ్మ చీర పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఆర్ ఎస్ కు దిమ్మతిరిగిపోయింది. 

ec


ఎలాగూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు.. కనీసం బతుకమ్మ చీరలన్నా ఇచ్చి ఓటర్లును ప్రసన్నం చేసుకుందామనుకుంటే ఇలా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందని వాపోతున్నారట టీఆర్ ఎస్ నేతలు. ఇక ఈ నిర్ణయం పట్ల జనంలోను సానుకూల స్పందనే వస్తోంది. గతంలోను కట్టుకోడానికి కూడా వీల్లేని మరీ నాసిరకమైన చీరలు పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు చాలా చోట్ల తీరలను మూకుమ్మడిగా తగలబెట్టిన ఘటనలను గుర్తుచేసుకుంటున్నారు.. ఈసారి అలాంటి చీరలు ఇవ్వకపోవడమే మంచిదని మహిళలు కామెంట్ చేస్తున్నారు.

ec

tags: ec, ec shocked to kcr, ec shocked to trs, election commission shocked to kcr, election commission shocked to trs, ec on bathukamma sarees, election commission bout bathukamma sarees

Related Post