మోదీతో కేసీఆర్ రహస్య ఎజెండా..

news02 June 14, 2018, 3:29 p.m. political

shabbir ali

హైదరాబాద్- పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవటం లేదని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి, సీఎల్పీ డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీర్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పొందుపరిచిందని గుర్తు చేసిన షబ్బీర్ ఆలి.. ఇప్పుడు బీజేపీ సర్కార్ కాదనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కి సంబందించి పొంగులేటి సుధాకర్ రెడ్డి కోర్ట్ కి వెళ్లిన తర్వాత  ఇప్పుడు అమలు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు షబ్బీర్ ఆలి. కేసీఆర్ హామీల అమలుకు కృషి చేయటం మానేశారని విమర్శించిన ఆయన.. రేపు ప్రధాని ని కలవడానికి వెళ్తున్న సీఎం కేసీఆర్.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు అమలు చేస్తుందో అడగాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తుందని.. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని ఇదే నా ప్రపంచం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు..12% రిజర్వేషన్లను రంజాన్ గిఫ్ట్ గా మోడీతో  ఇప్పించాలని డిమాండ్ చేసిన షబ్బీర్ ఆలి... అలా ఇప్పించలేకపోతే ముస్లింలకు క్షమాపణ చెప్పాలన్నారు.

ponguleti


ఇక రాష్ట్ర విభజన హామీలు న్యాయ బద్దం, చట్ట బద్దమైనప్పటికీ.. కేంద్రం ఒక శాతం కూడా అమలు చేయడం లేదని సీెల్పీ డిప్యూటి లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అందుకే నేను సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించానని చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని అన్నారు. నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తేకుండా విభజన హామీలు సాధించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ పర్సనల్ అజెండా కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న పొంగులేటి.. మోడీతో కెసిఆర్ కు రహస్య ఎజెండా ఏంటనేది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక భద్రాచలం రాముల వారి గుడి తెలంగాణలో ఉంటే.. రాముల వారి ఆస్తులు పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో ఉన్నాయని..  ఆంధ్రా లో ఉన్నటువంటి నాలుగు భద్రాచలం గ్రామాలను వెంటనే తెలంగాణలో కలపాలని అన్నారు.

tags: shabbir ali, ponguleti, ponguleti sudhakar reddy, shabbir ali fire on modi, shabbi ali fire on modi, ponguleti fire on kcr, ponguleti fire on modi,

Related Post