రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. అంతకంతకు ఆకాశాన్నంటుతున్న పెట్రల్, డీజిల్ ధరలతో జనం సతమతమవుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై కేంద్ర నియంత్రన కోల్పోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కేంద్రం దిగివచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 2రూపాయి 50పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది బీజేపీ సర్కారు. అంతే కాదు ఆయా రాష్ట్రాలు కూడా 2రూపాయల 50పైసలు తగ్గించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. దీంతో వెంటనే స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో 2రూపాయల 50 పైసలు తగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో సుమారు 5రూపాయల మేర ధర తగ్గడంతో ప్రజలు కొంత ఉరట చెందుతున్నారు.
ఐతే తెలంగాణ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం మనసు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకెల్ల తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకంటున్న కేసీఆర్.. మరి పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులపై ఎందుకు కరుణ చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై 2రూపాయల 50 పైసలు తగ్గించగానే.. దేశంలోని 11రాష్ట్రాలు సైతం 2రూపాయల 50పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ బడ్జెట్ తో పాలిస్తీ ఈ 11రాష్ట్రాల బడ్జెట్ తక్కువేనని చెప్పవచ్చు. మరి ఇంత భారీ బడ్జట్ ఉన్న తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నును కొంత మేరక తగ్గిస్తే బావుంటుంది కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కేసీఆర్ సర్కార్ కు మాత్రం మనసు రావడం మనసు రావడం లేదు.
కేంద్రం తగ్గించిన 2రూపాయల 50పైసలకు తోడు.. మన తెలంగాణ సర్కార్ సైతం 2రూపాయల 50పైసలు తగ్గిస్తే సామాన్యులకు పెద్ద ఉరట లభిస్తుంది. ఇప్పటికే జనం పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. జనం వాహనాలు నడపాలంటేనే జంకుతున్నారు. రోజు వారి అవసరాల కోసం వాహనాలు వాడక తప్పని పరిస్థితి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. కానీ కేసీఆర్ కు మాత్రం సామాన్యుల గోడు పట్టడం లేదు. రాష్ట్రాలు కూడా పెట్రోల్ , డీజిల్ పై పన్నును తగ్గించాలని సూచించినా.. కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనం మండిపడుతున్నారు. కేసీఆర్ కు ఎన్నికల గోల తప్ప.. ప్రజల కష్టాలు పట్టవా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.