పీసిసి మార్పుపై నిర్ణయం అధిష్టానందే

news02 June 5, 2019, 3:56 p.m. political

uttam

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్య పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష్య పదవి మార్పుపై ఢిల్లీలోని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై త్వరలోనే విశ్లేషించుకుంటామని ఆయన చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్య పద్మావతికి ఆసక్తి లేదని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

tags: uttam, pcc chief uttam, uttam on resignation, pcc chief about resignation, uttam kumar reddy about his resignation, uttam about resgnation speculations

Related Post