హ‌రీశ్ ను మ‌రింత టార్గెట్ చేసిన కేసీఆర్ ..!

news02 June 7, 2018, 9:15 p.m. political

harishrao

హైద‌రాబాద్ : గులాబీ పార్టీలో ముస‌లం పుట్టిందా .. సీఎం కేసీఆర్ .. మంత్రి హ‌రీశ్ రావు ల మ‌ద్య దూరం మ‌రింత పెరిగిందా .. అంటే అవున‌నే చెబుతున్నాయి జ‌రుగుతున్న ప‌రిణామాలు . ఇప్ప‌టికే కేటీఆర్ హ‌రీశ్ ల మ‌ద్య ఆదిప‌థ‌య పోరుతో హ‌రీశ్ రావు కు అన్ని విధాలా ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ వ‌స్తున్న కేసీఆర్ .. ప్ర‌తి అంశంలో హ‌రీశ్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విష‌యంలోనూ కేసీఆర్  హ‌రీశ్ నే టార్గెట్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల‌కు మంత్రి హ‌రీశ్ రావు కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా .. అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్ .

harishrao

ఆర్టీసీ గుర్తింపు సంఘం టిఎంయూ కు మంత్రి హ‌రీశ్ రావు గౌర‌వఅధ్య‌క్షుడుగా ఉన్న విష‌యం తెల్సిందే . టిఎంయూ అధ్య‌క్షుడు  అశ్వ‌ద్దామ రెడ్డి కూడా హ‌రీశ్ రావు కు చాలా స‌న్నిహితుడుగా ఉన్నాడు . అయితే ఇటివ‌ల కార్మికుల డిమాండ్ల సాధ‌న కోసం కార్మిక నాయ‌కులు .. ప్ర‌భుత్వానిక  మ‌ద్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు యూనియ‌న్ నాయ‌కుల‌కు మ‌ద్య దూరం పెరిగింది. టిఆర్ఎస్ అనుబంద సంఘంగా .. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ కు పెద్ద మ‌ద్ద‌తుగా నిలిచిన టిఎంయూ సంఘం .. ప్ర‌త్యేకించి అశ్వ‌ద్దామ‌రెడ్డి లంటే ఇప్పుడు కేసీఆర్ కు అస‌లు పొస‌గ‌డం లేదు .

harishrao

ఇక ఇప్పుడు టిఎంయూ సంఘం త‌మ డిమాండ్ల సాధ‌న కోసం కేసీఆర్ కు ఈనెల 11 వ‌ర‌కు డెడ్ లైన్ పెట్టింది. లేకుంటే .. 11 నుంచి స‌మ్మెకు వెళ‌తామ‌ని ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీంతో అస‌లు ముస‌లం మొద‌లైయ్యింది . టిఎంయూ సంఘానికి గౌర‌వధ్య‌క్షుడిగా ఉన్న హ‌రీశ్ రావు సంఘం నాయ‌కుల‌ను బుజ్జ‌గించ‌డంలో విఫ‌ల‌మైయ్యార‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట . మ‌రో విష‌యం ఏమిటంటే .. అస‌లు ఈ ఆర్టీసీ కార్మికుల గొడ‌వ‌ల ఎపిసోడ్ వెనుక హ‌రీశ్ రావే ఉన్నారా అనే అనుమానం కూడా సిఎం కేసీఆర్ కు ఉంద‌ట‌. దీంతో గులాబీ బాస్ అల్లుడు హ‌రీశ్ రావుపై వ‌త్తిడి పెంచిన‌ట్లు స‌మాచారం.

harishrao

జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై గుస్సాగా ఉన్న‌సిఎం కేసీఆర్ టిఎంయూపై చాలా సీరియ‌స్ గా ఉన్నారు. దీంతో ముందు టిఎంయూ లో చీలిక తీసుకొస్తే ఎలా ఉంటుంద‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో అనుకున్న‌దే త‌డువుగా మంత్రి నాయిని న‌ర్సింహ్మ‌రెడ్డిని రంగంలోకి దించి క‌థ న‌డుపుతున్నార‌ట‌. ఆర్టీసీ గుర్తింపు సంఘంలో చీలిక‌కు నాయిని ఆ సంఘంలోని ఓ వ‌ర్గం నాయ‌కుల‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని స‌మాచారం. దానికోసం అంగ‌బ‌లం అర్థ‌బ‌లంతో పాటు అన్ని ర‌కాలుగా ఎర‌లు వేస్తున్నార‌ట నాయిని .

harishrao

ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ వ‌త్తిడితో మ‌న‌స్థాపానికి గురైన మంత్రి హ‌రీశ్ రావు టిఎంయూ గౌర‌వఅధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది . తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి సంఘానికి గౌర‌వధ్య‌క్షుడిగా ఉన్న హ‌రీశ్ కు ఆ సంఘంతో .. అశ్వ‌ద్దామ‌రెడ్డితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి . దీంతో సీఎం అనుమానాల‌తో ఆయ‌న అయిష్టంగానే సంఘం గౌర‌వధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మైయ్యార‌ని స‌మాచారం. మ‌రి హ‌రీశ్ రావు రాజీనామాతో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందా .. లేక మ‌రింత జ‌టిలం అవుతుందా అంటే .. క‌చ్చితంగా రెండో జ‌రుగుతుందంటున్నారు హ‌రీశ్ వ‌ర్గీయులు.

harishrao

tags: Minister Harish Rao Resigned,KCR,Harishrao,trs,rtc,tsrtc,tsrtc nmu union,Ashvaddamareddy

Related Post