డి.శ్రీనివాస్ కొడుకు సంజయ్ పై నిర్భయ కేసు

news02 Aug. 3, 2018, 7:54 p.m. political

D.srinivas son Sanjay booked in Nirbhaya case

హైదరాబాద్: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. రాజులు సిపాయిలు కావచ్చు.. సిపాయిలు రాజు కావచ్చు. ప్రస్తుతం డిఎస్ పరిస్థితి ఇదే. కాంగ్రెస్ లో అగ్రనేతగా ఉండి రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పారు ఇది గతం. ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరి రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చీదరింపులు లోనై భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న డిఎస్ కు ఇప్పుడు చావు దెబ్బ తగిలింది. రాజకీయ అటుంచి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Pow Sandhya met home minister nayini Narsimha reddy

పార్టీ నుంచి బహిష్కరించాలని సొంత జిల్లా నిజామాబాద్ నేతలే తీర్మానం చేసి కేసీఆర్ పంపిన తర్వాత ఏ పార్టీలో చేరాలి అనే అంశంపై శ్రీనివాస్ అంతర్మథనం లో పడ్డారు. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతలోనే డిఎస్ కుమారు సంజయ్ లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్నారు. సొంత నర్సు కాలేజీ విద్యా ర్థినులే తమను వేధిస్తున్నారని పీఓడబ్ల్యూ సంధ్య తో కలిసి కేసు వేశారు. సంజయ్ పై కేసు బుక్కయింది.

D.srinivas son Sanjay sexula alligations

ఇందులోరాజకీయ కోణం ఉందా అని చర్చ జరుగుతుండగానే సంజయ్ కూడా స్పందించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తనపై కొందరు కేసులు పెట్టారని చెప్పారు. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు. నిజామాబాద్ జిల్లాలో డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారాడు. ముఖ్యంగా కెసిఆర్ కూతురు ఎంపీ కవిత పై ధర్మపురి అరవింద్ చేస్తున్న కామెం ట్స్ కెసిఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. డి శ్రీనివాస్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలనే తీర్మానం వెనుక కూడా ఇదే కారణం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు తన మొదటి కుమారుడు సంజయ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ కేసు వెనక రాజకీయం ఉందని శ్రీనివాస్ కుటుంబం భావిస్తోంది. రాజకీయంగా D. శ్రీనివాస్ కుటుంబాన్ని చెక్ పెట్టేందుకు నిర్భయ కేసు తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నీ పీవోడబ్ల్యూ సంధ్య కొద్దిమంది విద్యార్థినులను వెంట తీసుకువచ్చి కలవటం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పీవోడబ్ల్యూ సంధ్య చేత కొంత మంది టిఆర్ఎస్ నేతలే కేసు వేయించారా.. డి శ్రీనివాస్ కుటుంబాన్ని కట్టడి చేసేందుకు లైంగిక ఆరోపణల కేసులో ఇరికించారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతోంది. 

Mp D.srinivas political

డి.శ్రీనివాస్ బిజెపిలో చేరి తన కొడుకు ధర్మపురి అరవింద్ ను ఎంపీ కవిత పై పోటీ చేయిస్తారని కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. ధర్మపురి అరవింద్ ఇప్పటికే నిజామాబాద్ లోక్ సభ పరిధిలో అగ్రెసివ్ గా పర్యటనలు, మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్గా ప్రసంగాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఏకుమేకవుతారా అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు తన కుమారుడు సంజయ్ పై నిర్భయ కేసు నమోదు కావడంతో డి.శ్రీనివాస్ కుటుంబం భవిష్యత్ సుడిగుండంలో పడింది. డీ.శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది

tags: D. Srinivas , mp d.srnivas son Sanjay, mp D.srinivas family photos, D.s son Sanjay sex with college girls, D.srinivas joined in trs, D.srinivas political life, D.srinivas constency, Nizamabad constency, D. Srinivas negative place, D. Srinivas , cm kcr phone number, D.srinivas Home address, D.sirinivas cantact number, Trs MPs list, telangana Rajya sabha members.

Related Post