త్యాగం కాంగ్రెస్‌ది..భోగం నీదా..?

news02 July 9, 2018, 5:14 p.m. political

shabbir ali comments on kcr,modi

హైద‌రాబాద్‌: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ,సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ. మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డ‌డం త‌ప్ప ఇంకేమి చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేంద్రంలో బిజెపి స‌ర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ... తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో బహదూర్‌పురా నుంచి గాంధీ భ‌వ‌న్ వ‌ర‌కు నిర్వ‌హించిన భారీ మోట‌ర్ సైకిల్ ర్యాలీలో ష‌బ్బీర్ అలీ...తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాతో క‌లిసి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...నాలుగేండ్లలో ప్ర‌ధాని మోదీ దేశానికి చేసిందేమి లేద‌ని పేర్కొన్నారు. నోట్ల ర‌ద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మోదీ దారుణంగా దెబ్బ‌తీశార‌ని విమ‌ర్శించారు. 

shabbir ali

ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరు చెప్పి ప్ర‌జ‌ల‌ను వంచించ‌డం త‌ప్ప ఆయ‌న ఒర‌గ‌బెట్టిదేమీ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌లో న‌ష్ట‌పోతుంద‌ని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ‌ను ఇస్తే...కేసీఆర్ ఆమెనే విమ‌ర్శించ‌డం దారుణ‌మ‌న్నారు. త్యాగం సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీది అయితే...భోగం మాత్రం కేసీఆర్ అనుభ‌విస్తుండ‌ని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల‌కు ద‌మ్ముంటే ఒక్క‌సారి ఉస్మానియా యూనివ‌ర్శిటీ వెళ్లి రావాల‌ని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి యూత్ కాంగ్రెస్ ఇరుసులాంటిద‌న్నారు. పార్టీ అభివృద్ధిలో యూత్ కాంగ్రెస్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని ప‌నిచేయాల‌ని సూచించారు. 

kuntiya

కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా మాట్లాడుతూ...టీఆర్ఎస్ ప్ర‌భుత్వ క్యాబినెట్‌లో ద‌ళితులు, మ‌హిళ‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ద‌ళితున్ని ముఖ్య‌మంత్రిని చేయ‌డంతో పాటు...మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఆవిష‌యాల‌ను విస్మ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు. అయితే కాంగ్రెస్‌లో మాత్రం అటువంటి ప‌రిస్థితి లేద‌న్నారు. కాంగ్రెస్‌లో మ‌హిళ‌ల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించ‌డ‌మే కాకుండా...కాంగ్రెస్‌ మ‌హిళా అధ్య‌క్షురాలు, టీ-పీసీసీ ఉపాధ్యక్షులు అందరూ బ‌ల‌హీన వ‌ర్గాల వారే కావ‌డం నిజంగా గ‌ర్వంగా ఉంద‌న్నారు. 

tags: shabbir,kuntiya fire on kcr,modi,

Related Post