కోల్ కతా - మోడీ ప్రభుత్వం సీబిఐ ని వాడుకుంటుంది. ప్రత్యర్తి పార్టీల నేతలను సీబిఐతో బ్లాక్ మెయిల్ చేస్తుంది.. అక్రమ కేసులు పెట్టి.. ప్రత్యర్తి పార్టీలను భయ భ్రాంతులకు గురి చేస్తుంది.. మాపై కూడా మోడీ సిబిఐ చేత అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఇటీవలే ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇక ఇప్పుడు ఏకంగా కేంద్రంతో అమీతూమికి సిద్దమయ్యారు. ఆమే ఏకంగా రాజ్యాంగ పరిరక్షన పేరుతో దర్నాకు దిగారు. రాజకియంగా సిబిఐని వాడకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరీకి నిరసనగా.. ఆమె ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు. కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. మమతా తోపాటు.. కోల్ కతా సీపీ రాజవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు.
వివరాల్లోకి వేలితే.. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచారించేందుకు కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్న సీబీఐ అధికారుల బృందం రావడం.. మమతకు ఆగ్రహం తెప్పించింది. ఎటువంటి.. నోటిస్ లు లేకుండా.. సిపిని సిబిఐ ఎలా విచారన కోసం ఇంటికి వప్తారంటు మండిపడింది మమతా బెనర్జీ. ఈ రోజు సీపీ ఇంటి దగ్గర జరిగిన దానికి తాను చాలా భాధపడుతున్నానని మమత తెలిపారు. బిజేపీ సీపీని అనవసరంగా కేసులోకి లాగేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు. సేవ్ కాన్ స్టిట్యూషన్ పేరుతో ధర్నాకు దిగారు మమత. ఏకంగా మమతనే దర్నా కు దిగడంతో.. ఒక్కసారిగా.. బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.