సీఎం కేసీఆర్ కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు

news02 June 8, 2018, 10:21 p.m. political

 

 

 

 Pcc chief utham kumar reddy

హైదరాబాద్ : తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయ ని ప్రజలు భావించారు కానీ అవేమి జరగలేదని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అణచివేత ధోరణితో కేసీఆర్ పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అందుబాటులో ఉన్న నేతలతో సీఎల్పీ నేత జానా రెడ్డి ఇంట్లో చర్చించ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యేల సభ్యత్వరద్దు పై కేసీఆర్ సర్కార్ అప్రహస్వామికంగా వ్యవహరించిందని ఉత్తమ్ అన్నారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు చెబుతుంటే .. తాము నిరసన తెలిపామని తెలిపారు. మా నిరసనలో మండలి చైర్మన్ కు గాయమైనదని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై సభ్యత్వరద్దు చేయటం కరెక్ట్ కాదని అన్నారు.కోర్ట్ దాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వాలు పునరుద్ధరించాలని తీర్పు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కోర్ట్ దిక్కరణ కింద మళ్ళీ కోర్ట్ కు వెళతామని ఉత్తమ్ స్పష్టం చేశారు.కేసీఆర్ పాలనలో కోర్ట్ తీర్పులను గౌరవం లేదా అని ఉత్తమ్ ప్రశ్నించారు.కోర్ట్ తీర్పు ను గౌరవించని కేసీఆర్ సీఎం పదవిలో కొనసాగే నైతికత లేదని అన్నారు. ఈనెల 11 న స్పీకర్ ను కలిసి కాయిర్ట్ ఆర్డర్ ను అందిస్తామని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ని, రాష్ట్రపతి ని కూడా కలిసి జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామని తెలిపారు ఖమ్మం,అలంపూర్ లలో సభలు నిర్వహించిన తర్వాత.. 24 గంటల నిరాహార దీక్ష చేపడతామని ఉత్తమ్ తెలిపారు.కేసీఆర్ నిరంకుశ చర్యలపై కరపత్రాన్ని ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని అన్నారు..

tags: Utham kumar reddy, tpcc chief , cm kcr, komati reddy, janareddy house, mla sampath, tclp meeting, congress mlas, telangana assembly, telangana news, hicourt on mla expel.

Related Post