డీఎస్ పై కేసీఆర్ ధర్మసంకటం ..!

news02 July 8, 2019, 10:54 a.m. political

D srunivas

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ ది ఓ కీలకమైన పాత్ర. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా మంచి ప్రాధాన్యత తో కూడిన పదవులే లభించాయి. అయితే మారిన పరిస్తుల నేపథ్యంలో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలపై చేసిన కామెంట్లు విమర్శలు అన్నీ ఇన్నీకావు. తాజాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ తనయుడు .. సిట్టింగ్ ఎంపీ కవిత ను ఓడించడంలో ఆయనదే కీలకపాత్ర. ఇక్కడ వేరెవరో వ్యక్తి గెలిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ .. బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి కవితను ఓడించడం కేసీఆర్,కేటీఆర్ లకు మింగుడుపడడం లేదు. డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపంచడంలో వెనకుండి నడిపిన డీఎస్ పై చర్యలుంటాయని పార్టీ వర్గాలు ఎదురుచూశాయి. అయితే రోజులు గడుస్తున్నా... ఈ విషయంలో కేసీఆర్ మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

D srinivas

టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎంపికైన డి.శ్రీనివాస్ పై వేటువేసి అనర్హుడిని చేయాలని కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. స్వయంగా కేటీఆర్, కవిత కూడా తండ్రిపై వత్తిడి తెచ్చారు. అయినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇటీవల ఎంపీగా గెలిచిన కుమారుడు అరవింద్ సన్మాన సభలో పాల్గొన్న డీఎస్ ... రైతులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంటూ పరోక్షంగా కవిత ఓటమి గురించి ప్రస్తావించడం టీఆర్ఎస్ శ్రేణులకు అస్సలు మింగుడుపడటం లేదు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీఎస్‌పై పార్టీ పరమైన చర్యలు తప్పితే ... రాజ్యసభలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో మెజార్టీ కోసం తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్న బీజేపీ ... తమ సొంత పార్టీ ఎంపీ తండ్రి అయిన డీఎస్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందకపోవచ్చు. కేసీఆర్ డైస్ పై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటే .. బీజేపీలో చేరకుండానే, బీజేపీ అనుబంధ సభ్యుడిగా ఉంచాలని డీఎస్ కోరే అవకాశం ఉంది. ఏది ఏమైనా .. డీఎస్ మాత్రం కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారరనేది వాస్తవం .

D srinivas

tags: KCR,D SRINIVAS, KAVITHA,KTR,HARISH RAO,SANTHOSH,KESHAVARAO,TRS MPS,TRS RAJYASABHA MPS,DS,DARMAPURI ARAVIND,BJP NIZAMABAD MP DARMAPURI ARAVIND,DS SON, CONGRESS,AICC,RAHUL GANDHI, SONIA GANDHI,PRIYANKA GANDHI,TRS MP DS GOING TO JOIN CONGRESS,DS LETTER TO KCR

Related Post