వారితో రాజీనామా చేయించే దమ్ముందా..?

news02 June 8, 2019, 9:45 a.m. political

/uttham_kumar_reddy_on_clp_merzer_in_trslp

హైదరాబాద్: కాంగ్రెస్ ఎల్పీని ..టీఆరెస్ ఎల్పీలో విలీనం  చేస్తున్నట్లు స్పీకర్ బులెటిన్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా... ఎమ్మెల్యేలనుటీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ వ్యవహరించిన తీరు అప్రజాస్వామిక మన్న ఉత్తమ్ .. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్పీకర్ పదవిని  అప్రతిష్ట పాలు చేశారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం బాధాకరమని ఉత్తమ్ వాపోయారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ..ఆ .. 12మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు ఉత్తమ్. విలీనంపై సోమవారం హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపిన ఉత్తమ్... పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధిపొందారో కోర్టులో ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారన్న ఉత్తమ్ .. ఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క 36 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన ఈ దీక్ష కు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీలు, మేధావులు ,ప్రజాసంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు ఉత్తమ్.

tags: tpcc, uttham kumar reddy, clp merzer , trslp, telangana assembly, speakar pocharam srinivas reddy, cm kcr, congress mla's hycourt, suprim court, bhatti vikramarka,thirt six hours dheeksha

Related Post