టీఆర్ ఎస్ కు ఎన్నికల్లో తగిని బుద్ది చెప్పాలి..

news02 Oct. 11, 2018, 8:16 a.m. political

uttam

చేనేత కార్మికుల సమస్యలను మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనారోగ్యం పాలైన చేనేత కార్మికుల వైద్యఖర్చుల కోసం 5లక్షల రూపాయలు ఆరోగ్య భీమా, ప్రమాదవశాత్తు మరణిస్తే 5లక్షల రూపాయల ప్రమాద బీమా అందజేస్తామని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. 

uttam

చేనేత కార్మికులు, విద్యార్థులు, రైతులు, గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లపాటు రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన సాగిందని ఉత్తమ్ మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చిన టీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత రుణాలను మాఫీ చేసిన సంగతిని గుర్తు చేసిన ఉత్తమ్.. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఎం కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బూడిద బిజ్ఞమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

tags: uttam in weavers strike, uttam about weavers, uttam on weavers, uttam fire on kcr, uttam promisess to weavers, uttam comments on kcr

Related Post