నీ ఆస్తులు నీ కొడుకు కు ఇస్తావా.. నా కొడుకు ఇస్తావా..?

news02 June 28, 2018, 6:25 a.m. political

Cm kcr family

హైదరాబాద్ : అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో ఆధిపత్యపోరు మరో మారు తెరపైకి వచ్చింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ల మధ్య జరుగుతున్న ఫ్యూచర్ రాజకీయ వ్యూహాలపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తన కొడుకు కేటీఆర్ కు పట్టంకట్టేందుకు అడ్డుగా ఉన్న అల్లుడు హరీశ్ రావు ను ఈజీగా పక్కకు తప్పించేందుకు కేసీఆర్ స్కెచ్ వేసినట్లు కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

Cm kcr family photos

ఎన్నికలుఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ గనక అధికారంలోకి వేస్తే కేటీఆర్ ను సీఎం చేసుకునేందుకు కేసీఆర్ రూట్ క్లియర్ చేస్తున్నారు. దానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నది హరీశ్ రావు. కేటీఆర్ ను సీఎం చేస్తే హరీశ్ చూస్తూ ఊరుకుంటారా అనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. టిడిపిలో సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ప్రాధాన్యత పెంచగనే అల్లుడు అధికారాన్ని ఎగేసుకొని పోయినట్లు ఇక్కడ కూడా హరీశ్ తిరుగుబావుటా ఎగురేస్తరని అందరికీ అనుమానాలున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా కేటీఆర్ సీఎం అయితే హరీశ్ రావు ఏం చేయవచ్చనే అంశంపై అనేక అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తమ ఫ్యామిలీ మీటింగ్ లో అదును చూసి హరీశ్ రావు నాడిని తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెడితే ఎలావుంటుంది అనే చర్చను కేసీఆర్ లేవదీసి నట్లు సమాచారం. మంది చాలా చెబుతారు కానీ ఒకటి ఆలోచించాలి హరీశ్.. నీవు సంపాదించిన ఆస్తులు నీ కొడుకుకు ఇచ్చుకుంటవ లేకపోతే కేటీఆర్ కొడుకుకు ఇస్తావా.. నీ కొడుకుకు లేదా బిడ్డకు ఇస్తవు కదా.. మరి నా కొడుకు కేటీఆర్ కు సీఎం పదవి ఇవ్వడంలో తప్పులేదు కదా.. సహజన్యాయ సూత్రం ఆలోచించు. నీకు మంచి భవిష్యత్ వుంది. పార్టీలో , ప్రభుత్వంలో కేటీఆర్ ఎంతో నీవు అంతే నని హరీశ్ రావు కు హితబోధ చేసినట్లు ప్రగతి భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Ktr, Kavitha, Harish rao

ఇప్పటికే కేటీఆర్ ను ఎలా ప్రమోట్ చేసుకున్నారో అందరకీ తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి కేటీఆర్ ను జన్నాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో కేటీఆర్ ను మరో పవర్ సెంటర్ గా మార్చారు. హరీశ్ కు ఉన్న మాస్ ఇమేజ్ ముందు కేటీఆర్ కు ఇమేజ్ వున్న లీడర్ గా నిలబెట్టేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు.

Minister Harish Rao bad feelings

ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా టీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. బయటికి ఎవరికి చెప్పుకున్నా కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు హరీశ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీలో హరీశ్ రావు కు ప్రత్యేక వర్గం ఉంది. హరీశ్ యే నిర్ణయం తీసుకున్నా ఫాలో అయ్యే జనం ఉన్నారు. సో కేటీఆర్ ను సీఎం చేస్తే హరీశ్ ఏమి చేస్తారనేది ప్రశ్నార్థకం.ప్రస్తుత పరిణామాలు కేసీఆర్ అనుకుంటున్నట్లు జరుగుతున్నా భవిష్యత్ లో ఏదో జరిగే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

tags: Cm kcr family, cm kcr with ktr, cm kcr personal phone number, cm kcr whatsup number, cm kcr with family, cm kcr early life, cm kcr wicky, cm kcr walking style, cm kcr on future politics, next cm of Telangana, trs cm candidate, Telangana next cm, kaleswaram project, minister Harish Rao home, Harish Rao family photos, ktr family, ktr phone number, trs family drama, cm kcr family drama.

Related Post