టీఆర్ ఎస్ గిరిజన వ్యతిరేక పార్టీ..

news02 Oct. 15, 2018, 8:02 p.m. political

ramulu naik

టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ పార్టీలో ఆత్మగౌరవం.. ప్రజాస్వామ్యం లేదని ఆయన మండిపడ్డారు. అంతే కాదు టీఆర్ ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టీఆర్ ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించారు. తాను గిరిజనుడిని అయినందు వల్లే తనకు టీఆర్ ఎస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని రాములు నాయక్ ఆవేధన వ్యక్తం చేశారు. గిరజనులకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లపై తాను మాట్లాడినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడని ద్రోహులు.. ప్రగతి భవన్ లో కేసీఆర్ వెంట.. మంత్రి వర్గంలోను ఉన్నారని రాములు నాయక్ విమర్శించారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించిన నాయక్ కంటనీరు పెట్టుకున్నారు. 

trs

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్.. ఆ హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని రాములు నాయక్ మండిపడ్డారు. గిరిజనులంటే టీఆర్ ఎస్ పార్టీకి చిన్నచూపుని ఆరోపించిన నాయక్.. గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని విమర్శించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కోండా సురేఖ, డీ శ్రీనివాస్ లాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా.. తనను మాత్రం ఎందుకు సస్పెండ్ చేశారని రాములు నాయక్ ప్రశ్నించారు. గిరిజన నాయకులు, మేధావులతో చర్చించి తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పిన రాములు నాయక్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు గిరిజనులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

tags: ramulu naik, ramulu naik fire on kcr, ramulu naik fire on trs, mlc ramulu naik fire on trs, mlc ramulu naik fire on trs, trs mlc ramulu naik fire on kcr, ramulu naik about kcr, ramulu naik about trs

Related Post