తీసుకోక‌పోతే రూ.1000 ఫైన్‌

news02 June 6, 2018, 5:28 p.m. political

fine on dogs

బెంగ‌ళూరు: సాధార‌ణంగా వాహ‌నాల‌కు లైసెన్స్‌లు ఉండ‌డం ప‌రిపాటి. బైక్కో, కారుకో లైసెన్స్ తీసుకోవ‌డం ఆన‌వాయితీ. కానీ, బెంగ‌ళూరులో మాత్రం వింత ప‌రిస్థితి నెల‌కొంది. పెంపుడు జంతువు కుక్క‌కు లైసెన్స్ తీసుకోవాలంటా..! అంతేకాదు అలా లైసెన్స్ తీసుకొని వారికి రూ.1000 వ‌ర‌కు జ‌రిమానా త‌ప్ప‌దంటా..! విన‌డానికి వింత‌గా ఉన్న ఇప్పుడు బెంగ‌ళూరులో ఇదే పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

bbmp

పెంపుడు జంతువు కుక్క‌ల‌ను పెంచుకునేందుకు బృహాత్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక(బీబీఎంపీ)కొత్త నిబంధ‌న‌ను తెర‌పై తెచ్చింది. తమ లిమిట్స్‌లో ఉన్న ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లలో కుక్కలను పెంచుకోవాలంటే న్యూ పెట్ లైసెన్సింగ్ స్కీమ్ పాటించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కుక్క‌లు పెంచుకునే వారెవ్వ‌రైనా లైసెన్సులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని తెలిపింది. అలాగే అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఒక పెంపుడు కుక్క కంటే ఎక్కువగా ఉండ‌కూడ‌ద‌ని అంటోంది. ఇక ఇండిపెండెంట్ ఇళ్లలో 3 కుక్కల క‌న్నా ఎక్కువ‌గా  పెంచుకోకూడదు చెబుతోంది. 

dogs 2
అంతేకాదు కుక్క‌ల‌ను పెంచుకునే వారు లైసెన్స్‌తో పాటు..రేడియో కాల‌ర్‌తో కూడిన ఎంబెడెడ్ చిప్ తీసుకోవాల‌ని సూచిస్తోంది. బీబీఎంపీ పెట్టిన నిబంధ‌న‌లను ఎవ‌రూ పాటించ‌కున్నా... రూ.1000 వ‌ర‌కు జ‌రిమానా వేస్తామంటోంది. అయితే ఇళ్ల‌ల్లో కుక్క‌ల తాకిడిని త‌గ్గించేందుకు బీబీఎంపీ మంచి నిర్ణ‌య‌మే తీసుకున్నా... జంతు ప్రేమికులు మాత్రం ఆసంస్థ నిర్ణ‌యంపై మండిప‌డుతున్నారు. కొత్త‌గా కుక్క‌ల‌పై ఫైన్ ఏంట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: petanimal,dogs,bbmp,bengalore,begalore nagara palaka samasta,animals,

Related Post