ఇప్పటికే నియోజకవర్గాన్ని చక్క పెడుతున్న ఎంపి కవిత

news02 July 9, 2018, 8:08 p.m. political

Cm kcr family

హైదరాబాద్ : అవును మీరు చదువుతున్న నిజమే. సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్, ఆయన కూతురు కవిత, ఆయన మేనల్లుడు హరీశ్ రావు, కేసీఆర్ మరదలు కొడుకు సంతోష్ లు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరో వ్యక్తి కేసిఆర్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయించేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Mp kavitha with husband

ఇప్పుడువరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ .. బయటకి కనబడకుండా ఉంటున్న ఎంపీ కవిత భర్త అనిల్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సమాచారం. ఆయన్ను జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ లో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ ఇప్పటికే రెండుసార్లు ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. సంజయ్ తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా తిరగకపోవడం.. నియోజకవర్గంలో మాస్ జనాలకు దగ్గర కాలేకపోవడం సంజయ్ మైనస్ గా టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Mp kavitha family

ఎంపీ కవిత ఇప్పటికే జగిత్యాల పై దృష్టి సారించారు . జగిత్యాల పట్టణంలోని ఒక ఇంటికి తీసుకొని ప్రజలతో కలిసి వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎంపి కవితనే జగిత్యాల నుంచి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె తన భర్త అనిల్ కోసం జగిత్యాల సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ పోటీకి సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టిఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

Mp kavitha husband

ఇప్పటి సీఎం కేసీఆర్ కుటుంబం ఐదుమంది రాజకీయాల్లో పదవులు అనుభవిస్తుండంపై తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆరో వ్యక్తి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పై ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావొచ్చ ని కేసీఆర్ కుటుంబంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా తెలంగాణలో కుటుంబ పాలన పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆరో వ్యక్తి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రతిపక్షాలకు అస్త్రం గా మారే అవకాశం లేకపోలేదు.

tags: Cm kcr family, mp kavitha husband, mp kavitha family, cm kcr daughter, mp kavitha rare pics, ktr new look, mp Santhosh pics, harish Rao family, ktr family, mp Santhosh family, minister ktr wife, cm kcr with Kavitha family, jagityala Mla, jagityala trs, Mla Jeevan Reddy, jagityala trs Mla, mp kavitha phone number, mp kavitha house address, pragathi bhavan address, pragathi bhavan phone number.

Related Post