కుమార స్వామికి సీఎం కేసీఆర్ ఇచ్చిన స‌ల‌హా ఏంటి..?

news02 May 16, 2018, 9:17 p.m. political

Cm kcr federal front

హైద‌రాబాద్ః క‌ర్ణాట‌క ఫ‌లితాలు నిమిషానికో మ‌లుపు తిరుగుతున్నాయి. ప్ర‌భుత్వం ఏర్పాటుకోసం అటు బీజేపూఈ ఇటు కాంగ్రెస్ నేత‌ల ఎత్తులు, పై ఎత్తులు రాజ‌కీయాల్ని హీట్ పుట్టిస్తున్నాయి. జేడీఎస్‌-కాంగ్రెస్ క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని కుమారా స్వామి, సిద్ద‌రామ‌య్య లు ప‌ట్టుద‌ల‌తో ఉంటే.. బీజేపీ సింగ‌ల్ గా స‌ర్కారు పెట్ట‌బోతోంద‌ని కాషాయ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ ట్విస్టులో తెలంగాణ సీఎం ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తి క‌రంగా మారింది.

Cm kcr meet karaswamy

ఎన్నిక‌ల‌ముందు బెంగ‌ళూరుకు వెళ్ళి దేవెగౌడ‌, కుమార‌స్వామిని క‌లిసి తెలుగు ప్ర‌జ‌లంతా జేడీఎస్ గా మ‌ద్ద‌తియ్యాల‌ని పిలుపు ఇచ్చి వ‌చ్చారు. అయితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప‌లితాల త‌ర్వాత కేసీఆర్ అధికారికంగా స్పందించ‌లేదు. కాని క‌న్న‌డ ట్విస్టు రాజ‌కీయాల్ని క్షుణంగా ప‌రిశీలిస్తున్న కేసీఆర్‌.. ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారట‌. అటు కుమార స్వామితో.. ఇటు దేవె గౌడ‌తో ఫోన్ లొ మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. అయితే కేసీఆర్ ఏం స‌ల‌హాలు ఇస్తున్నార‌న్న‌ది మాత్రం చాలా సీక్రెట్‌.

Kumaraswamy - siddaramaiah

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయితే ఆ ప్రబావం తెలంగాణ పాలిటిక్స్ పై ప‌డుతుంది. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేసీఆర్ కు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స‌ర్కారు రావ‌టం ఇష్టం లేక‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. అదే బీజేపీ ప్ర‌భుత్వం అయితే తెలంగాణ లో ఆ పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశాలు లేవు. అంతే కాక బీజేపీతో కేసీఆర్ కు ఇంకా మంచి సంబందాలున్నాయ‌నే చ‌ర్చ ఉంది. సో బీజేపీకే కేసీఆర్ సపోర్త‌ట్ చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  

Yaddurappa

ప్ర‌స్తుతం జేడీఎస్ క్రెసెస్ లో ఉంది. జేడీఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేల‌ను చీల్చేందుకు బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు. ఒక్కొక్క‌రికి వంద‌కోట్ల రూపాయలు ఇచ్చి అయినా కొనేందుకు బీజేపీ నేత‌లు సిద్ద‌మ‌వుతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో బాగ‌స్వామ్యం కావాల‌ని జేడీఎస్ నేత‌ల‌ను క‌లిసిన కేసీఆర్‌.. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోక‌పోతే త‌ర్వాత వారిని ఏ మొహం పెట్టుకుని క‌లుస్తాడ‌ని సొంత పార్టీలోనే చ‌ర్చించుకుంటున్నారు. ఒక వేళ జేడీఎస్ కు ఆయ‌న స‌పోర్ట్ గా నిల‌వ‌క‌పోతే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ఇత‌ర నాయ‌కులు న‌మ్మే అవ‌కాశం ఉండ‌దు. సో కేసీఆర్ మైండ్ లో ఏముంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

tags: cm kcr, kumara swamy, devegowda, federal front, congress-jds, siddaramaih, mallikarjuna karge, kcr benglore tour, kernataka politics.

Related Post