అతనో పెద్ద హీరోకు అల్లుడు..

news02 Nov. 5, 2018, 8:48 a.m. political

dastoor

సినిమా రంగం నుంచి మొదలు పెడితే రాజకీయం, సాఫ్ట్ వేర్ ఇలా అన్ని రంగాల్లోను మీ టూ ఉద్యమం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు తామెదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పుతున్నారు. వెండితెరపై మహారాణులాగా వెలిగిపోయే హీరోయిన్ల నిజ జీవితంలో మాత్రం కష్టాలూ, కన్నీళ్ళూ ఉంటాయన్న సంగతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సినీ రంగంలో ఇప్పటి వరకూ ఏ నటీ పెద్ద స్థాయిలో ఉన్న హీరో మీద ఆరోపణలు చేయలేదు. కానీ అందాల భామ అమైర్‌ దస్తూర్‌ మాత్రం సినీ రంగంలో స్టార్‌ హీరోగా చలామణి అవుతున్న వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించి సంచలనం రేపుతోంది.

dastoor
 
తనకు ఉత్తరాదిన, దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి రైంగిక వేధింపులు ఎదురయ్యాయని అమైర్ దస్తూర్ చెబుతోంది. ఐతే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన ఎక్కువ వేధింపులకు గురయ్యానని చెప్పింది. దక్షిణాదిన ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో హీరోతో పాట చేస్తున్నప్పుడు ఆ హీరో అనవసరంగా నా మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని అమైర్ దస్తూర్ ఆరోపించింది. ఆ సమయంలో ఈ అంశాన్ని దర్శకుడి దృష్టికి తీసుకు వెళ్తే... ఇక అప్పటి నుంచి నాకు నరకం చూపించారని ఆవేధన వ్యక్తం చేసింది. కావాలని షూటింగ్‌కి ఉదయం ఎనిమిది గంటలకే పిలిచేవారని... అప్పటి నుంచీ మేకప్ వేసుకుని రెడీ అయి కార్వన్‌లో కూర్చునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలా ఎంత సేపు వేచిచూసినా షూటింగ్ కు మాత్రం పిలిచేవారు కాదని చెప్పింది. ఒక్కోసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించి.. షూటింగ్ పేకప్ సమయానికి ఓ ఐదు నిమిషాలు షూటింగ్‌ చేసేవారని అమైర్ చెప్పి బాధపడింది. 

dastoor

అంతేకాదు ఒక్కోసారి షూటింగ్ లేకపోయినా ఉరికే పిలిచేవారని.. ఓ రోజు తనకుషూటింగ్‌ లేకపోయినా పిలిచి... సాయంత్రం వరకు వేయిట్ చేయించి.. పేకప్ చెప్పే సమయానికి ఈ రోజు షూటింగ్ లేదని చెప్పారని బాధ పడింది.  ఇక అప్పటి నుంచి దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం వేస్తోందని అమైర్ దస్తూర్ చెప్పుకొచ్చింది. ఐతే ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని.. తన మనసులోనే ఉంచుకుని మధనపడ్డానని చెప్పింది. ఇక తనను వేధించిన హీరో దక్షిణాదిలో మంచి పులుకుబడి ఉన్న వ్యక్తి అని.. ఓ పెద్ద హీరోకు అల్లుడని చెప్పింది అమైర్ దస్తూర్. ఐతే ఆ హీరో బయటపెడితే తన సినీ జీవితాన్ని సర్వ నాశనం చేస్తారని అమైర్ దస్తూర్ ఆందోళన చెందుతోంది. అందుకే తనను లైంగికంగా వేధించిన హీరో పేరు ఇప్పుడు చెప్పనని.. ఐతే ఏదో ఒకరోజు ఆ హీరో పేరు తప్పకుండా ఈ ప్రపంచానికి చెబుతానని మాత్రం అమైర్ దస్తూర్ స్పష్టంగా చెప్పింది.

tags: amayur datur, amayur datoor on mee too, amayur abou mee too, amayur about top hero, amayur dastur about sexual harrassment, actress amayur dastur

Related Post