ప్రజలే నా కుటుంబం

news02 April 10, 2019, 12:12 p.m. political

uttam

కాంగ్రెస్‌ పార్టీకి నల్గొండ లోక్ సభ స్థానం కంచుకోట అని, అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపిస్తే ఎస్సారెస్పీ కాల్వలు, మూసీ నది ఆధునికీకరించి.. సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఎస్వీ కళాశాల నుంచి ఓల్డ్ బస్టాండు, పీఎస్సార్‌ సెంటర్‌, శంకర్‌ విలాస్‌ సెంటర్‌ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కర్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పదహారేళ్ల వయస్సులో దేశ సేవ చేయడానికి భారత సైన్యంలో చేరనని, దేశం కోసం యుద్ధ విమానం నడిపానని ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలే తన కుటుంబమని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రజాసేవే జీవితమే తన లక్ష్యమన్నారు. కష్టపడి పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. 

uttam

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. రాహూల్ ప్రధఆని ఐతే ప్రతి కుటుంబానికి నెలకు 6వేల రూపాయలు అందుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పరి పాలన చేస్తుందన్న దామోదర్ రెడ్డి.. టీఆర్ ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వాలు పేదల అవసరాలను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్‌రెడ్డి దళితుల కోసం చేసిన ఒక్క పనినైనా చూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, నాయకులు తండు శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వరరావు, గోపగాని వెంకటనారాయణగౌడ్‌, బైరు వెంకన్నగౌడ్‌, కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, తదితరులతో పాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

tags: uttam, pcc chief uttam, uttam election campaign, pcc chief uttam election campaign, uttam loksabha election campaign, uttam road show in nalgonda, uttam nalgonda road show, uttam raod show in suryapeta

Related Post