తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

news02 Oct. 6, 2018, 4:36 p.m. political

ఈసీ

అంతా అనుకున్నట్లే జరిగింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మిజోరాం కు ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషనర్ ఏపీ రావత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. తెలంగాణలో డిసెంబర్ 7న మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే విడత పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న వెలువరించనున్నారు.

 

తెలంగాణ ఎన్నికలకు సంబందించిన షెడ్యూల్.. నామినేషన్లకు తుది గడువు- నవంబర్‌ 19 నామినేషన్ల పరిశీలన- నవంబర్‌ 28

నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్‌ 22 పోలింగ్‌ తేదీ- డిసెంబర్‌ 7

ఓట్ల లెక్కింపు- డిసెంబర్‌ 11

ఈసీ

ఇక తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల షెడ్యూల్‌ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమేనని... ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారు రావత్‌ తెలిపారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందన్న ఎన్నికల సంఘం.. ఈనెల12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రావత్ తెలిపారు. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్న రావత్... మిగతా రాష్ట్రాల్లో ఇప్పటినుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని చెప్పారు. మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు , మిగతా మూడు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.

tags: ఈసీ, కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్, ec, central election commission, telangana election schedule, telangana polling date, december 7th telangana elections

Related Post