తెలంగాణలో దోపిడీ వ్యవస్థ నడుస్తోంది..

news02 Feb. 27, 2018, 8:05 p.m. political

తాండూర్- వచ్చే ఎన్నికల్లో మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి ఖాయమని.. ఆ తరువాత ఆ?న ఇంట్లో కూర్చోవాల్సిందేనని అన్నారు పీసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర విచారాబాద్ జిల్లా తాండూర్ కు చేరింది. ఈ సందర్బంగా టీఆర్ ఎస్ సర్కార్ పై ఉత్తం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ పాలిస్తుందని విమర్శించిన ఉత్తం.. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 

ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో మాదిరి ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లపాటు రైతాంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ముధిరాజులని బీసీ - డి నుండి బిసి - ఏ లోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ కమిటీ వేస్తామని తెలిపారు పీసిసి చీఫ్ ఉత్తం.

మంత్రి వర్గంలో ఆరుగురు ద్రోహులు.. షబ్బీర్ ఆలి
ఇక కెసిఆర్ మంత్రి వర్గంలో 6గురు తెలంగాణ ద్రోహులు ఉన్నారని ఫైర్ అయ్యారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి. కాంగ్రెస్ లోఫర్ పార్టీ అయితే కెసిఆర్ పెద్ద లోఫర్ అని విమర్శించారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. ముస్లింలను మేసం చేశారని ఆరోపించారు షబ్బీర్ ఆలి.

tags: congress bus yatra, uttam bus yatra, uttam tandur bus yatra

Related Post