ఆవిర్బావ స‌భ‌కు భారీ జ‌న స‌మీక‌ర‌ణ ..!

news02 April 14, 2018, 1:19 p.m. political

tjf

హైద‌రాబాద్ : తెలంగాణ గడ్డ‌పై రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అన్ని జెండాల‌ను ఒక్క గూటి కింద‌కు తెచ్చి రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క భూమిక పోషించిన‌ ఆచార్య కోదండ‌రామ్ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌ చేయ‌డం.. ఈనెల 29న బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఇందు కోసం ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భ కోసం తెలంగాణ జ‌న స‌మితి నేత‌లు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందుకు అనుగుణంగా జిల్లాల వారిగా జ‌న స‌మీక‌ర‌ణ‌కు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ప్ర‌తి జిల్లాలో టీజేఎస్ నాయ‌కుల‌ను స‌మాయత్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జేఏసీలో కీల‌కంగా ప‌ని చేసిన నాయ‌కులు, నేత‌లు, అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయ‌కుల‌ను ఆస‌రాగా చేసుకుని పెద్ద ఎత్తున ఈనెల 29న స‌భ‌ను  నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. 

tjf sabha

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. జ‌న‌ స‌మితి నిర్వ‌హించే స‌భ‌కు అస‌లు అనుమ‌తి ల‌భిస్తుందా.. అనేది ఇప్ప‌డు హాట్ టాపిక్ మారింది. స‌భ నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. స‌భ నిర్వ‌హిస్తే త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కేసీఆర్ జంకుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ నేరెళ్ల ఘ‌ట‌న‌, ఇసుక మాఫియా, మియాపూర్ భూ మాఫియా, మైనార్టీల‌కు 12  శాతం రిజ‌ర్వేష‌న్లు,  ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూ పంపిణీ వంటి అంశాల‌పై స‌ర్కారును క‌డిగిపారేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళ‌న‌తో స‌ర్కారు గుబులు ప‌ట్టుకోగా.. తాజాగా జ‌న సమితి పేరుతో కోదండ‌రామ్ స‌భ నిర్వ‌హిస్తే త‌మ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌ని టీఆర్ ఎస్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. 29న స‌భ స‌క్సెస్ అయితే   రానున్న ఎన్నిక‌ల్లో త‌మ కారు జోరు త‌గ్గుతుంద‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

kodandaram party

అయితే స‌ర్కారు అడ్డుప‌డిన తెలంగాణ జ‌న స‌మితి నాయ‌కులు ఇప్ప‌టికే కోర్టుకు వెళ్లారు. కోర్టు త్వ‌ర‌లోనే దీనిపై తీర్పు వెలువ‌ర‌చ‌నుంది.  కోదండ‌రామ్ స‌భ‌కు మ‌రో 15 రోజులే మిగిలి ఉండ‌డంతో.. ఇప్పుడు అంద‌రి దృష్టి టీజేఎస్‌పై  ఉంది. ఒక వేళ కోర్టు అనుమ‌తి వ‌స్తే ఏ మేర‌కు జ‌న స‌మితి నేత‌లు స‌క్సెస్ అవుతారు..  కోదండ‌రామ్ స‌భ నిర్వ‌హ‌ణ‌తో ప్ర‌జ‌ల‌ను ఏలా ఆక‌ట్టుకుంటార‌నేదే అంద‌రి మ‌దిల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌.

tags: kodandaram,tjf,kcr,jac,telangana jac,tjf sabha

Related Post