భారీ ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నేతలు..

news02 Oct. 3, 2018, 8:58 p.m. political

congress

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేసి.. ముందస్తుకు తెరతీసిన కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో తామే ముందున్నామని చెప్పుకుంటున్న టీఆర్ ఎస్ నేతలకు ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావానికి సిద్దమైంది. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేశారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గురువారం ఉదయం 11గంటలకు జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు కాంగ్రెస్ నేతలు. 

uttam

పూజా కార్యక్రమంలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, ప్రచార కమిటీ చైర్మెన్ మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, షబ్బీర్ ఆలి తదితరులు పాల్గొననున్నారు. ఇక పూజా కార్యక్రమం తరువాత అలంపూర్ చౌరస్తా, శాంతీనగర్, బజార్ రోడ్ లో కాంగ్రెస్ నేతలు రోడ్ షోలు నిర్వహించనున్నారు. అటు గద్వాల్ నియోకజవర్గంలో జమ్ములమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తదితరులు.. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు రాజీవ్ చౌక్ దగ్గర నిర్వహించే భహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు.

tags: congress, congress campaigning, congress election campaigning, congress election compaigning start from gadwal, congress election compaign

Related Post