ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం

news02 June 8, 2018, 3:13 p.m. political

The kodandaram

కరీంనగర్: సమ్మెకు దిగితే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలనుంచి తీసేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించకుండా సీఎం బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు. టీఎంయూకు మంత్రి హరీశ్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ చర్చలకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమన్న కోదండరామ్.. సమ్మెకు టీజేఎస్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనేక అవార్డులు గెలుచుకున్న సంస్థ ఆర్టీసీ సంస్థపై డీజిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆర్టీసీ యూనియన్లను చర్చలకు పిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె అనివార్యమైతే వారికి తెలంగాణ జనసమితి అండగా ఉంటుంది. భూ ప్రక్షాళన, రైతుబంధుతో భూ స్వాములకే లాభం జరిగిందని విమర్శించారు కోదండరాం. కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ మాజీ నేత నరహరి జగ్గారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు తెలంగాణ జనసమితి లో చేరారు.

tags: Jac chairman, telangana janasamithi, janasamithi jenda, tsrtc sammey, cm kcr, telangana rtc, telangana rtc jobs, telangana rtc online,hyderabad city bus timings pdf,hyderabad city bus enquiry number.

Related Post