స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై చేతులెత్తేసిన స‌ర్కార్..

news02 July 12, 2018, 1:10 p.m. political

gram panchayath elections, panachayath raj act, kcr govt

హైద‌రాబాద్ :  పంచాయితీ ఎన్నిక‌ల‌పై ప్ర‌తిప‌క్షాల అంటున్న‌దే నిజ‌మైంది. ప్ర‌భుత్వం పంచాయితీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తామని.. జూన్ లో అని ఒక‌సారి, జూలైలో ఇంకోసారి.. కాదు కాదు ప‌క్కాగా ఆగ‌ష్టు నెల‌లో స‌ర్పంచ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డ‌న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్ర‌క‌ట‌న మొద‌టి రోజు నుండే ఎన్నిక‌ల‌పై ప‌లు అనుమానాలు వ్య‌వ‌క్తం మ‌వుతు వ‌చ్చాయి. ముఖ్యంగా రిజ‌ర్వేష‌న్ ల‌ పై ప్ర‌భుత్వం చెప్పిన మాట‌ల‌పై క్షేత్ర స్తాయి నుండి భిన్న వాధ‌న‌లు వ‌చ్చాయి. బీసీల జ‌నాభా పై సీఎం కేసీఆర్, అధికారులు, మంత్రులు ఇలా ఒక్కక్క‌రు ఒక్కోచోట‌, ఒక్కో విధంగా మాట్లాడిన తీరు  బీన్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చాయి. 

kcr, cm telangana

ఇదిలా వుంటే ప్ర‌బుత్వం హ‌డావిడిగా తీసుకువ‌చ్చిన పంచాయితీ రాజ్ కొత్త చ‌ట్టం. మరోవైపు తండాల‌ను పంచాయితీలుగా మార్చుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం వేగంగా జ‌రిగిపోయాయి.అయితే వీటీలో లోపాలు ఉన్నాయిని ప్ర‌తిప‌క్షాలు చెబుతు వ‌స్తున్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో బీసీలు, ఎస్సిలకు రావ‌ల్సిన సర్పంచ్ ల్లో కోత‌ప‌డింది. దీంతో ప్ర‌భుత్వం పై ఉడికి పోయిన బీసీ,ఎస్సీ లు కొంద‌రు త‌మ‌కు జ‌రుగుతున్న ఆన్యాయంపై న్యాస్థానికి వెళ్ళ‌డం.. దానిపై స్పందించిన కోర్ట్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిత‌ప్పుప‌ట్ట‌డం జ‌రిగింది. ముందు బీసీ జ‌నాభా ఎంత ఉందో తేల్చిన త‌ర్వాత‌నే పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని కోర్ట్ ఆదేశించి అక్షింత‌లు వేసింది. దీంతో తేరుకున్న ప్ర‌భుత్వం ఇప్ప‌డి కిప్పుడు బీసీల లెక్క తేల్చ‌లేమ‌ని చేతులెత్తేసింది. ఒక‌వేల కోర్ట్ చెప్పిన‌ట్లు లెక్క‌లు తేల్చితే .. ఇన్నాళ్లు ప్ర‌భుత్వం చెబుతున్న‌లెక్క‌లు త‌ప్పని తేలిపోతాయ‌న్న‌భ‌యం అధికార వ‌ర్గాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దీనితో ఇప్ప‌డు ఈ తుట్టేను క‌దిల్చితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఎటు పోయి ఎటు ముప్పు వ‌స్తుందో అన్న‌భ‌యంతో.. ఇక పంచాయితీ ఎన్నిక‌ల వాయిదాకు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తుంది. 

grampanchayathi, village, ts govt, sarpanch elections

దీనితో ఈ జూలై నెలాఖ‌రుతో స‌ర్పంచ్ ల ప‌ద‌వీకాలం ముగియ నుండటంతో .. ఇక ఆగ‌ష్టు నుండి అధికారుల‌ను పాల‌న కు జైకొడుతుంది కేసీఆర్ స‌ర్కార్ . ఇన్నాళ్లు స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.. మేమే గెలుస్తామ‌న్న అదికార పార్టీ మాటలు మ‌టుమాయం కాబోతున్నాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వం నిర్ణ‌యంలో అన్నిలోపాలే ఉన్నాయి.. క‌బ‌ట్టి ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లు స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌వ‌ని చెబుతు వ‌స్తున్న విప‌క్షాల మాట‌లే నిజ‌మ‌వ‌బోతున్నాయి. నిన్న‌టి  దాకా స‌ర్పంచ్ లుగా పోటి చేద్దామ‌నుకున్న‌వాళ్ళు ..ఇక దానిని ప‌క్క‌న బెట్టి హ్యాపీగా త‌మ ప‌ల‌నుల‌ను చేసుకోవ‌చ్చు. సో.. ఆగ‌ష్టు ఒక‌టి నుండి రాష్ట్రంలో ఉన్న 12 751 గ్రాపంచాయితీలలో ప‌దివికాలం ముగియ‌ని 17 పంచాయితీల‌ను ప‌క్క‌న బెడితే.. 12 734 గ్రామాలు అధీకారుల పాల‌న‌లోకి రాబోతున్నాయ‌న్న‌మాట‌.

tags: kcr, telangana cm, panchayathi alections, congress, bjp,cpi, cpm, bc reservastions, ts hycourt, ts govt

Related Post