ఏపీకి మద్దతివ్వండి ప్లీజ్..

news02 April 3, 2018, 10:51 a.m. political

babu delhi tour

ఢిల్లీ- విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం బస్తునకు చేరుకున్న సీఎం... ఈ ఉదయం ఏపీ భవన్‌ లో టీడీపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ తరువాత 10 గంటలకు పార్లమెంట్‌ చేరుకున్న చంద్రబాబు లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్లను కలుస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌ లీడర్లను కోరారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు.
ఇక చంద్రబాబు డిల్లీ పర్యటన నేపధ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తో పాటు అన్ని విపక్ష పార్టీల నేతలతో చర్చిస్తారు. విభజన సందర్బంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం వైఖరిని వారి ముందు ఉంచనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోను చంద్రబాబు బేటీ కానున్నారు. తాజా రాజకీయపరిణామాలపై బాబు వెంకయ్యతో చర్చించనున్నారని తెలుస్తోంది. 

Related Post