తొడలు కొట్టుకుంటే రక్తమే వచ్చేది

news02 April 21, 2018, 5:09 p.m. political

Kishan reddy on balakrishna

హైదరాబాద్ : ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మేల్యే బాలకృష్ణపై బిజెపి శాసనసభ పక్ష నేత మండిపడ్డారు. బాలకృష్ణ వాఖ్యలు చంద్రబాబు సమర్ధిస్తారా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిన్న చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని పై పరుష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన మంత్రులు, సీఎం ముందే బాలకృష్ణ మాట్లాడిన మాటలు తెలుగు ప్రజల ప్రతిష్ఠ ను దిగజార్చే విధంగా ఉన్నాయని అన్నారు. బాలకృష్ణ తానే మాట్లాడారా...? లేక చంద్రబాబు మాట్లాడించారా.. అని ప్రశ్నించారు. సినిమాలకే పరిమితమైన బాలకృష్ణ... ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలను మర్చిపోయారని సెటైర్ వేశారు. సినిమాల్లో తొడలు కొట్టుకుంటే నడుస్తుంది కాని రాజకీయాల్లో తొడలు కొట్టుకుంటే రక్తం వస్తుందని సెటైర్ వేశారు.

Related Post